Pawan Kalyan OG Movie| పవన్ ఓజీ నుంచి ఫ్యామిలీ పోస్టర్

విధాత : పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan)-ప్రియాంక మోహ‌న్ (Priyanka Mohan) జంట‌గా రూపొందుతున్న ఓజీ సినిమా(OG Movie) నుంచి మేకర్స్ ఆదివారం ప్రత్యేక అప్డేట్ గా పోస్టర్ విడుదల చేశారు. ఈ పోస్టర్ (Family Poster)లో పవన్ కల్యాణ్, ప్రియాంక మోహన్ లు కోనేటిలో దీపాలను వదులుతున్న ఫోటో ఫ్యామిలీ పిక్ గా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా మూవీ నుంచి సువ్వీ సువ్వీ అంటూ సాగే పాట‌ను వినియ‌క చ‌వితి(Vinayaka Chavithi 2025) ప‌ర్వ‌దిన్నాన్ని పుర‌స్క‌రించుకుని ఆగ‌స్టు 27 న రిలీజ్ రిలీజ్ (OG Release Date)చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టికే చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం మ‌రో నెల రోజుల్లో థియేట‌ర్ల‌లోకి రానుంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌కు తెర లేపారు. వరుసగా విడుద‌ల చేసిన పోస్ట‌ర్లు, గ్లింప్స్‌, పాటలు సినిమాపై అంచ‌నాల‌ను రెట్టింపు చేయ‌డంతో సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి నెలకొంది. హరిహరవీరమల్లు ఆశించిన విజయాన్ని అందుకోకపోవడంతో ఓజీ సినిమా పట్ల హీరో పవన్, మేకర్స్ జాగ్రత్తలు వహిస్తూ హిట్ కోసం పరితపిస్తున్నారు.