Easy Diner Coupons | పేటీఎం సీఈవో బిల్లులో ఇంత డిస్కౌంటా? మీరు నమ్మలేరు!

సాధారణంగా యూపీఐ చెల్లింపుల్లో మనకు కొన్ని కూపన్లు వస్తుంటాయి. పేటీఎం ద్వారా చెల్లింపులు జరిపిన పేటీఎం సీఈవో విజయ్‌ శేఖర్‌ శర్మకు మాత్రం భారీగా డిస్కౌంట్‌ లభించింది. ఆయన పెట్టిన పోస్టు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నది.

Easy Diner Coupons | సాధారణంగా ఒక రెస్టారెంట్ లేదా హోటల్‌కు వెళ్తే క్రెడిట్ లేదా డెబిట్ కార్డు లేదా ఆన్ లైన్‌లో పేమెంట్ చేస్తుంటాం. కాని పేటీఎం సీఈవో విజయ్ శేఖర్ శర్మకు మాత్రం తన బిల్లులో రూ.16వేల డిస్కౌంట్ లభించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ఖాతాలో విజయ్ శేఖర్ షేర్ చేయడంతో పలువురు ఆశ్చర్యపోయారు.

ఢిల్లీ ఎయిర్ పోర్టులో రాడిసన్ బ్లూ ప్లాజాలో ‘ది గ్రేట్ కబాబ్ ఫ్యాక్టరీ’ ఉంది. ఆయన తన జన్మదిన వేడుకల సందర్భంగా అక్కడకు వెళ్లి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ కోసం ఆర్డర్ ఇచ్చారు. బిల్లు రూ.40,828 కాగా ఈజీ డైనర్ కూపన్లను ఉపయోగించారు. ఈ కూపన్లతో సరాసరి రూ.16,095 డిస్కౌంట్ లభించగా, రూ.24,733 చెల్లించాలని బిల్లు చేతికిచ్చారు.ఈ బిల్లు వివరాలను తన ఎక్స్ ఖాతాలో షేర్ చేయడంతో వైరల్ అవుతోంది.

రూ.16,095 లో అమెరికన్ ఎక్స్ ప్రెస్ కార్డు డిస్కౌంట్ రూ.2వేల వరకు ఉంది. అమెరికన్ ఎక్స్ ప్రెస్ సెంచూరియన్ కార్డును బ్లాక్ కార్డు అని కూడా పిలుస్తుంటారు. ప్రపంచంలో వాణిజ్యవేత్తలు, బడా బడా వ్యాపార వేత్తలు, సీఈఓలకు ఈ కార్డులను ఇన్విటేషన్ తో ఇస్తుంటారు. అర్హత వివరాలు ఎక్కడ కూడా బహిర్గతం కావు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికంగా ఉన్నవారిని గుర్తించి, ఇన్విటేషన్లను పంపిస్తుంటారు. మనంతట మనం ఈ కార్డును తీసుకోవడం సాధ్యం కాదు. ఈ కార్డు పొందడం స్టేటస్ సింబల్ గా భావిస్తుంటారు. కార్డు తీసుకున్నవారు ప్రతి నెలా బిల్లు చెల్లించాల్సిందే. సాధారణ క్రెడిట్ కార్డుల మాదిరి పార్ట్ పేమెంట్ చేయడం కుదరదు.

ఇవి కూడా చదవండి..

Apple CEO | టిమ్ కుక్ వారసుడు రెడీ.. యాపిల్ సీఈవో ఎవరంటే!
Tomato Price Hike| టమాటా ఫైరింగ్..మొన్న కిలో 1 రూపాయి…నేడు రూ.63 !
Car Fire| కారులో ఏసీ వేసుకుని నిద్రలోకి..డ్రైవర్ సజీవ దహనం

Latest News