Snakes Brumation | ఇప్పటికే దేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలికాలం ఎంటరైపోతున్నది. అంతా ఇళ్లల్లో తలుపులేసుకుని, కిటీకిలు మూసేసుకుంటే కానీ.. చలి తీవ్రత నుంచి తప్పించుకోలేక పోతున్నారు. చలికాలం వచ్చిందంటే పాములు కనిపించకుండా పోతాయి. అయితే.. వాటి మనుగడలో అది వ్యూహాత్మక అదృశ్యమని నిపుణులు చెబుతున్నారు. పాముల రక్తం చల్లగా ఉంటుందని తెలిసిందే. ఈ కారణంగా పాములు తమ అంతర్గత శరీర ఉష్ణోగ్రతను తమంతట తాముగా నియంత్రించుకోలేవు. దాంతో చలి సమయాలు.. ప్రత్యేకించి శీతాకాలంలో వాటి మనుడగ పెను సవాలుగా మారుతుంది. ఉష్ణోగ్రతలు పడిపోతే.. వాటి జీవక్రియ మందగిస్తుంది. ఇష్టానుసారం తిరగలేవు. దీంతో వేటాడే సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. ఫలితంగా.. అవి బ్రూమేషన్ అని పిలేచే ఒక తరహా నిద్రాణ స్థితిలోకి వెళ్లిపోతాయి. బ్రూమేషన్ సమయంలో పాములు చాలా వరకూ క్రియారహితంగానే ఉండిపోతాయి. ఈ సమయంలో అవి వెచ్చగా ఉండే భూమిలోని పుట్టల్లో, రాళ్ల మధ్యలో, ఎండుటాకుల్లో లేదా మానవ నిర్మిత ప్రదేశాల్లో తలదాచుకుంటాయి.
దీని వల్ల అవి తమ శక్తిని కాపాడుకోవడమే కాకుండా.. గడ్డకట్టే స్థితి నుంచి తప్పించుకుంటాయి. లేదంటే చనిపోవడం లేదా.. వెచ్చటి ప్రదేశాలు వెతుక్కోవడం వాటికి దిక్కు. పాములు ఎకోథర్మిక్. అంటే.. అవి వాటి సమీప ప్రాంతాల ఉష్ణోగ్రతలపైనే ఆధారపడి ఉంటాయి. ఇతర క్షీరదాలు, పక్షుల మాదిరి పాములు తమ శరీరంలో ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేసుకోలేవు. ఉష్ణోగ్రతలు పడిపోగానే.. వాటి జీవక్రియ నాటకీయంగా మందగిస్తుంది. వాటి మానసిక స్థితికి సంబంధించిన అన్ని అంశాలను అది ప్రభావితం చేస్తుంది. కదలికలు మందగిస్తాయి. డైజేషన్ ఆగిపోతుంది. ఈ సమయంలో వేటాడటం అనేది దుర్లభంగా మారుతుంది. శరీరం గడ్డకట్టే పరిస్థితుల్లో అవి కనుక చురుకుగా వ్యవహరించాలని చూస్తూ ఆకలితోనో లేదా.. వేరే కారణాలతో చనిపోవడమే. అందుకే చలికాలాలు పాములకు పెను సవాలు. అందుకే అవి బ్రూమేషన్ స్థితిలోకి వెళ్లిపోతాయి. ఈ సమయంలో పాములు ఒకరకమైన నిద్రాణ స్థితిలో ఉంటాయి. అప్పుడు వాటి జీవిక్రయ రేటు, గుండె కొట్టుకునే వేగం, శ్వాస తీసుకోవడం గణనీయంగా తగ్గిపోతాయి. ఇతర ప్రాణాల్లాగా పాములు దీర్ఘ, నిరంతర నిద్రలోకి వెళ్లలేవు. కొత్త ఆశ్రయం కోసం లేదా నీటికోసం మెల్లగా కదులుతాయి. ఆ సమయంలో కూడా ఎక్కువగా ఇనాక్టివ్‌గానే ఉంటాయి. మళ్లీ అనుకూల వాతావరణ పరిస్థితి వచ్చే వారకూ వాటిలో శక్తిని కాపాడుకునేందుకు బ్రూమేషన్ ఉపకరిస్తుంది. బ్రూమేషన్ లేకపోతే వాటి గతి అంతే.
Tim Friede 200 Snakebites Antivenom | 200కుపైగా పాములతో కాట్లు వేయించుకున్న మనిషి.. ఎందుకు? ఏమిటి? ఎలా?
బ్రూమేషన్ సమయంలో.. అంటే చలికాలంలో సాధారణంగా వదిలివేసి, మట్టి చెత్త పేరుకుపోయిన తూములు, లేదా పుట్టల్లో ఇవి నివసిస్తాయి. గుహల వంటి ప్రదేశాలు, రళ్లురప్పలతో కూడిన ప్రదేశాల్లోనూ ఆవాసం పొందుతాయి. ఎండిపోయిన ఆకుల కుప్పల్లో, లేదా కట్టెల మధ్యలో ఉంటాయి. మనుషులు నివసించే ప్రాంతాల్లనైతే బేస్‌మెంట్లు, శిథిలాల కుప్పలు, ఇరుకైన మూలల్లో నివసిస్తాయి. మరో కీలక విషయం ఏమిటంటే.. ప్రతి చలికాలంలోనూ అవి తాము గతంలో ఉన్న ప్రాంతాలను వెతుక్కుంటూ వస్తాయి. అటువంటి ప్రాంతాల్లో కొన్ని నెలలపాటు ఎలాంటి ఆహారం లేకుండా బతుకుతాయి. వాతావరణ పరిస్థితులు మెరుగుపడుతున్న క్రమంలో వీటిలోనూ క్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతాయి. బ్రూమేషన్ స్థితి నుంచి క్రమక్రమంగా బయటకు వస్తాయి. కొద్ది రోజుల్లోనే అవి సాధారణ పరిస్థితుల్లోకి వచ్చేస్తాయి. వేట, పునరుత్పత్తి కార్యక్రమాలు పుంజుకుంటాయి.
Read Also |
Deathbots | ఏఐ ఉపయోగించి ఆత్మలతో మాట్లాడవచ్చునా?
Anaconda Video | అనకొండ, కొండచిలువ మధ్య ఫైట్‌లో గెలిచేదేంటి? వాటి బలాబలాలేంటి?
Cobra Bite First Aid Guide | నాగుపాము కాటువేస్తే వెంటనే ఏం చేయాలి? యాంటీ వెనమ్ అంటే ఏంటి?
