99 Rupees Goat | 99 రూపాయలకే 12 కిలోల మేకపోతు ఇస్తామంటే ఎవరు కాదంటారు? ఏకంగా 12 బీరు బాటిళ్లు, ఒక రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్, ఒక నాటుకోడి.. ఇవి కూడా 99 రూపాయలకే పొందే అవకాశం ఉంటే? ఉంది.. దాని గురించే ఈ కథనం.
దసరా పండుగకు ఊళ్లలో బంపర్ ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటారు. తక్కువ మొత్తంలో టోకెన్‌లు అమ్మి.. లక్కీడీప్ తీసి బహుముతులు ఇస్తూ ఉంటారు. ఆ టోకెన్ ధర కూడా అందరికీ అందుబాటులో ఉండటంతో చాలా మంది ఆకర్షితులవుతూ ఉంటారు. ఇలా టోకెన్లు అమ్మి.. వచ్చిన సొమ్ము నుంచి బహుమతులు ఇస్తారు. 99 రూపాయలకే మేకపోతు వస్తుందంటే.. అదృష్టాన్ని పరీక్షించుకుందామని ముందుకు వచ్చే ఔత్సాహికులూ ఉంటారు. ఇదే క్రమంలో ఇప్పుడు ఇప్పుడు సంక్రాంతికి కూడా చాలా గ్రామాల్లో ఈ కూపన్‌ల ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. సంక్రాంతికి పల్లెటూళ్లన్నీ కోలాహలంగా ఉంటాయి. ఊళ్ల నుంచి వచ్చే బంధువులతో ఇళ్లన్నీ సందడి చేస్తుంటాయి. ఇక ఆటపాటల సంగతి సరేసరి. వీటికి కొత్త జోష్ ఇచ్చేలా ఈ లక్కీ డ్రా కూపన్లు అమ్ముతున్నారు.
కేవలం 99 రూపాయలకే మేకపోతు.. 12 కేఎఫ్ బీర్లు, రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్, నాటుకోడి.. ఇలా నాలుగు బహుమతులు అందిస్తున్నట్టు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం గొల్లపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నది.
సంక్రాంతి పండుగ వేళ నాన్‌వెజ్ ప్రియులకు నోరూరించేలా 99 రూపాయలకే మేకపోతును ఎగరేసుకుపోయే చాన్స్ కల్పించారు లక్కీ డ్రా నిర్వాహకులు. శ్రీ రేణుక ఎల్లమ్మ లక్కీ డ్రా పేరిట మొదటి బహుమతిగా మేకపోతును ఇవ్వనున్నారు. రెండు, మూడో బహుమతులు మందుప్రియులకు కిక్కెక్కించేవి. అవేంటంటే.. రెండో బహుమతి కింద 12 కింగ్ ఫిషర్ బీర్ల కార్టన్, మూడో బహుమతి రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ ఇవ్వనున్నారు. ఇక నాలుగో బహుమతిగా మాంఛి నాటుకోడిని ఇవ్వనున్నారు. జనవరి 14, 2026న సంక్రాంతి పండుగ సందర్భంగా లక్కీ డ్రా నిర్వహించనున్నారు. ఈ లక్కీ డ్రాలో గెలుపొందినవారికి పైన పేర్కొన్న బహుమతులు అందించనున్నారు.
ఇవి కూడా చదవండి..
Retired Employees Protest| రిటైర్డ్ ఉద్యోగుల అసెంబ్లీ ముట్టడి..ఉద్రిక్తత
Pandugappa Fish : గోదావరిలో చిక్కిన పండుగప్ప చేప..భారీ ధరకు విక్రయం
Narayanpet : విద్యార్థుల డేంజర్ జర్నీ…చూస్తే దడదడే!
