Delhi Blast | ‘ఢిల్లీలో ఏదో జరగబోతోందా?’.. పేలుడుకు ముందు విద్యార్థి పోస్ట్

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పేలుడు జరగడానికి మూడు గంటల ముందు ఓ విద్యార్థి ‘రెడ్డిట్’ వేదికగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది.

లాల్‌కిల్లా గేట్ 1 సమీపంలో పేలుడు తర్వాత పోలీసులు, స్థానికులు – Red Fort Blast Aftermath Scene in Old Delhi

ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడుతో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పేలుడు జరగడానికి మూడు గంటల ముందు ఓ విద్యార్థి ‘రెడ్డిట్’ వేదికగా పెట్టిన పోస్ట్ ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఈ పోస్ట్ లో పేలుడు జరిగిన ప్రదేశంలో భారీగా భద్రతా బలగాలను మోహరించడంపై అనుమానం వ్యక్తం చేశాడు.

సోమవారం సాయంత్రం 4గంటలకు 12వ తరగతి చదువుతున్నట్లు చెప్పుకుంటున్న ఓ విద్యార్థి సామాజిక మాధ్యమం అయిన ‘రెడ్డిట్’ వేధికగా ‘ఢిల్లీలో ఏదో జరగబోతోందా?’ అంటూ పోస్ట్ పెట్టాడు. అయితే, ఈ పోస్ట్ పేలుడుకు కేవలం 3 గంటల ముందు పెట్టడంతో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పోస్టులో ‘నేను ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చాను. ఎర్రకోట, మెట్రోస్టేషన్ ల వద్ద ఎప్పుడూ చూడనంతగా పోలీసులు, ఆర్మీ సిబ్బంది, మీడియా కనిపిస్తోంది. మెట్రోలో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఇంతమంది ఆర్మీని ఎప్పుడూ చూడలేదు. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది?’ అని ఆ విద్యార్థి అనుమానం వ్యక్తం చేశారు.

ఈ పోస్ట్ పెట్టిన కాసేపటికే కార్ బ్లాస్ట్ జరిగింది. దీని తరువాత ఆ విద్యార్థి పెట్టిన పోస్ట్ మీడియాలో తెగవైరల్ అయింది. అతను మనల్ని తెలియకుండానే హెచ్చరించాడని అంటూ కామెంట్లు పెడుతున్నారు. కాగా, ఈ ఘటనపై ఉగ్రవాద కోణంలో దర్యాప్తు చేపట్టారు అధికారులు. పేలుడు ఘటనలో మృతుల సంఖ్య తాజాగా పెరుగుతోంది. సోమవారం జరిగిన బ్లాస్ట్ లో 9మంది అక్కడికక్కడే మరణించాగా 20 మందికిపైగా గాయపడ్డారు. గాయపడ్డవారిలో మరో ముగ్గురు ప్రాణాలు వదిలినట్లు మంగళవారం సాయంత్రం ఢిల్లీ పోలీస్ అధికారులు వెల్లడించారు.