Site icon vidhaatha

SLBC రెస్క్యూ ఆపరేషన్ మరింత ఆలస్యం

విధాత, వెబ్ డెస్క్: ఎస్ఎల్బీసీ టన్నెల్(SLBC TUNNEL) ప్రమాదం(Accident)లో గల్లంతైన ఎనిమిది మంది(Eight missing people) ఆచూకీ కోసం చేపట్టని రెస్క్యూ ఆపరేషన్(Rescue Operation) మరింత ఆలస్యమవుతోంది. రెస్క్యూ ఆపరేషన్ లో కన్వేయర్ బెల్ట్ ను పునరుద్ధరించి టన్నెల్ లో కూలిపడిన మట్టి, రాళ్లను బయటకు తరలించే పనులు చేపట్టడంతో పనులు వేగవంతమవుతాయనుకున్న రెస్క్యూ టీమ్ సిబ్బందికి టన్నెల్ లో నీటి ఊట మట్టి తవ్వకాలకు ఆటంకంగా తయారైంది. కన్వేయర్ బెల్ట్ కూడా మరోసారి మొరాయించింది.

మరోవైపు 15 మీటర్ల మేర ప్రీకాస్ట్ బెస్మెట్ లకు క్రాక్స్ రావడంతో సహాయక చర్యల్లో నిమగ్నమైన వారు సైతం ప్రమాదంలో పడే అవకాశముందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. అటు టీబీఎం(TBM) మిషన్ కటింగ్ కూడా ఇంకా పూర్తి కాకపోవడం మరో అవరోధంగా మారింది. పనులు వేగవంతం చేసే క్రమంలో టన్నెల్ బోర్ మిషన్ నమూనా తయారీ చేసి..ప్రమాద ప్రాంతాన్ని రెస్క్యూ టీమ్ పరిశీలించింది. ఎక్కడెక్కడ కార్మికులు చిక్కుకుని ఉండొచ్చనే దానిపై వారు అధ్యయనం చేశారు.

Exit mobile version