Site icon vidhaatha

SLBS టన్నెల్ ప్రమాదం.. 3మీటర్ల లోతు బురదలో మృతదేహాలు

 

విధాత‌: ఏడు రోజుల క్రితం (గత శనివారం) Slbc టన్నెల్ ప్రమాదంలో చిక్కుకున్న ఎనిమిది మంది ఆల‌స్య‌మైన‌ ప్రాణాలతో బయటపడతారని అంతా ఆశించారు. కానీ ఈ ప్రమాదం అంతిమంగా తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. టన్నెల్ లో చిక్కుకున్న ఎనిమిది మంది చ‌నిపోయిన‌ట్లు టన్నెల్ లో 3 మీటర్ల లోతు బురదలో వీరి మృతదేహాలను గుర్తించిన‌ట్లు స‌మాచారం.

ఐఐటీ మద్రాస్ నిపుణుల బృందం అత్యాధునిక పరికరాలు, రాడార్ల సాయంతో మృతదేహాల గుర్తింపులో కీలక పాత్ర పోషించింది. మృతి చెందిన వారిలో ఇద్దరు ఇంజినీర్లు ఉండ‌గా, ఆరుగురు కార్మికులు ఉన్నారు. టన్నెల్ లో చిక్కుకున్న అందరూ మరణించారని నిర్ధారణ కావడంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. ప్ర‌స్తుతం మృత‌దేహాల‌ను తీసుకు వ‌చ్చేందుకు నిపుణుల బృందాలు క‌ష్ట ప‌డుతూనే ఉన్నాయి.

Exit mobile version