Telangana Panchayat Elections| రాష్ట్రంలో తొలి సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నిక

తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్ ఎన్నికల హడావుడి సాగుతుంది. తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. అయితే పలు పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికల కోసం స్థానికంగా జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఇంద్రవెల్లి మండలంలోని తేజపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. దీంతో ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో మొదటిదిగా..ఏకగ్రీవాల్లోనూ మొదటిదిగా రికార్డు కొట్టినట్లయ్యింది.

విధాత : తెలంగాణ రాష్ట్రంలో సర్పంచ్(Telangana Panchayat Elections) ఎన్నికల హడావుడి సాగుతుంది. తొలి దశ గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా గురువారం నుంచి నామినేషన్లు ప్రారంభమయ్యాయి. అయితే పలు పంచాయతీల్లో సర్పంచ్ పదవులు ఏకగ్రీవ(Unanimous Sarpanch) ఎన్నికల కోసం స్థానికంగా జోరుగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో ఓ గ్రామంలో సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవం అయినట్లుగా సమాచారం. ఇంద్రవెల్లి మండలంలోని తేజపూర్ గ్రామ పంచాయతీలో సర్పంచ్ పదవి ఏకగ్రీవంగా ఖరారైంది. దీంతో ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నిక తెలంగాణ రాష్ట్రంలో మొదటిదిగా..ఏకగ్రీవాల్లోనూ మొదటిదిగా రికార్డు కొట్టినట్లయ్యింది.

సర్పంచ్‌తో పాటు వార్డు సభ్యులందరినీ కూడా స్థానికులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సాలెగుడా, డోబ్బిగూడ, తేజపూర్ గ్రామ పెద్దలఆధ్వర్యంలో సమావేశం నిర్వహించి, ఎన్నికలు అవసరం లేకుండా స్వచ్ఛందంగా కోవా రాజేశ్వర్‌ను సర్పంచ్‌గా ఎంపిక చేయడంతో పాటు 8 మంది వార్డు సభ్యుల ఎన్నుకున్నట్లుగా సమాచారం. అయితే తేజాపూర్ సర్పంచ్ ఏకగ్రీవ ఎన్నికకు సంబంధించి అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది.

ఏకగ్రీవ సర్పంచ్ కోసం 30 లక్షల ఆఫర్

మరోవైపు వికారాబాద్ జిల్లా, పెద్దేముల్ మండలం నాగులపల్లికి చెందిన యువకుడు యాదవ రెడ్డి తనను ఏకగ్రీవ సర్పంచ్‌గా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.30 లక్షలు కేటాయిస్తానని ప్రకటించారు. ఇందులో రూ.10 లక్షలు హనుమాన్ మందిరానికి, అలాగే మైనారిటీ, క్రిస్టియన్ వెల్ఫేర్ కోసం మొత్తం రూ.6 లక్షలు, రూ.2 లక్షలు ఎమర్జెన్సీ ఫండ్‌కు ఇస్తానని ప్రకటించి ఆసక్తి రేపారు. ఇప్పటికే స్టేషన్ ఘన పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తన నియోజకవర్గంలో ఏకగ్రీవ సర్పంచ్ లకు ప్రభుత్వం ఇచ్చే రూ.10లక్షలు(చిన్న పంచాయతీలకు), రూ.15లక్షలు(పెద్ద పంచాయతీలకు) ప్రోత్సాహంతో పాటు తాను సొంతంగా రూ.15లక్షలు ఇస్తానని ప్రకటించి సంచలనం రేపారు. మొత్తంగా మూడు విడుతల్లో జరిగే పంచాయతీ ఎన్నికల్లో ఈ ధఫా ఏకగ్రీవాలు భారీగానే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. గతంలో 2019లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1,935 సర్పంచ్ పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 162 అయ్యాయి. ఆ తర్వాతి స్థానాల్లో నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నిర్మల్, నల్గొండ, వరంగల్ రూరల్ జిల్లాలు ఉన్నాయి. అయితే ఏకగ్రీవ సర్పంచ్ గ్రామాలకు ప్రభుత్వం ఇస్తామన్న నిధులు ఇవ్వకపోవడంతో ఏకగ్రీవల వ్యవహారం ప్రహసనంగా మారింది.

Latest News