Group 2 Recruitment| గ్రూప్ 2 పై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

గ్రూప్ 2 నియమకాలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో ఇచ్చిన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది.

విధాత, హైదరాబాద్ : గ్రూప్ 2 నియమకాల(Group 2 Recruitment)పై తెలంగాణ హైకోర్టు(Telangana High Court) కీలక తీర్పు వెలువరించింది. గతంలో ఇచ్చిన హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పును సస్పెండ్ చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్వర్వులు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో 2015 గ్రూప్‌-2 ర్యాంకర్లకు భారీ ఊరట దక్కంది. 2015-16లో నిర్వహించిన గ్రూప్-2లో ఎంపికైన వారి జాబితాను రద్దు చేస్తూ ఇటీవల ఉన్నత న్యాయస్థానం సింగిల్‌ బెంచ్ ఆదేశాలు ఇచ్చింది.

వైట్నర్‌, దిద్దుబాటు ఉన్న జవాబుపత్రాల మూల్యాంకనంపై అసహనం వ్యక్తం చేసింది. తాజాగా గురువారం సింగిల్‌ బెంచ్‌ ఉత్తర్వులను సీజే ధర్మాసనం రద్దు చేయడంతో వారికి ఊరట లభించినట్లయ్యింది.

Latest News