సత్యం సుందరం వంటి క్లాసిక్ కల్ట్ హిట్ చిత్రం తర్వాత కార్తి (Karthi) నటిస్తున్న కొత్త చిత్రం వా వాతియార్ (Vaa Vaathiyaar). మన బేబమ్మ కృతిశెట్టి (Krithi Shetty) కథానాయిక. తాజాగా ఈ మూవీ నుంచి ఉయురే పతికన్నా అంటూ సాగే పాటను విడుదల చేశారు.
వివేక్ ఈ పాటకు లిరిక్స్ అందించగా విజయ్‌నరైన్, ఆదిత్య రవీంద్రన్, సంతోష్ నారాయణన్ (Santhosh Narayanan) ఆలపించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందజేశారు. నలన్ కుమార స్వామి దర్శకత్వం వహించగా సత్యరాజ్, రాజ్ కిరణ్, ఆనంద్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాట తెలుగు వెర్షన్ త్వరలోనే రిలీజ్ కానుంది.