- ఐసీస్ కేసులో 13 మంది నిందితుల అరెస్టు
విధాత: ఐఎస్ఐఎస్ కుట్ర కేసుకు సంబంధించి కేంద్ర ఉగ్రవాద నిరోధక సంస్థ శనివారం మహారాష్ట్ర, కర్ణాటకలో విస్తృతంగా సోదాలు నిర్వహించింది. దాడుల్లో 13 మంది నిందితులను అరెస్టు చేసింది. మహారాష్ట్రలోని 40 ప్రాంతాల్లో, కర్ణాటకలో మరో చోట జాతీయ దర్యాప్తు సంస్థ సోదాలు నిర్వహించింది. మహారాష్ట్రలోని థానే, పూణే, మీరా భయాందర్‌తో సహా 40 వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరుగుతున్నాయని వర్గాలు తెలిపాయి.
దొంగతనం కేసులో అరెస్టయిన ఇద్దరు వ్యక్తులను విచారించగా, ఐఎస్‌ఐఎస్‌తో సంబంధం ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. దాంతో కేసును మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్‌కు బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ తెల్లవారుజామున దాడులు చేపట్టింది. ఆగస్టు పేలుడు పదార్థాల తయారీలో ప్రమేయం ఉన్న అనుమానితుడు ఆకిఫ్ అతీక్ నాచన్‌ను అరెస్టు చేశారు. ముంబైకి చెందిన తబీష్ నాజర్ సిద్ధిఖీ, పూణేకు చెందిన జుబైర్ నూర్ మహమ్మద్ షేక్ అలియాస్ అబు నుసైబా, అద్నాన్ సర్కార్, థానేకి చెందిన షార్జీల్ షే, జుల్ఫికర్ అలీ బరోదావాలా అనే మరో ఐదుగురిని ఒక నెల క్రితం ఏజెన్సీ అరెస్టు చేసింది. వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా తాజా సోదాలు, అరెస్టులు జరిగినట్టు తెలుస్తున్నది.