శివరాత్రి ఊరేగింపులో కరెంట్‌ షాక్‌.. 14 మంది పిల్లలకు గాయాలు

రాజస్థాన్‌లోని కోటాలో శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించిన ఊరేగింపునకు విద్యుత్తు షాక్‌ తగిలింది

  • Publish Date - March 8, 2024 / 01:52 PM IST

చావుబతుకుల్లో ఇద్దరు

జైపూర్ : రాజస్థాన్‌లోని కోటాలో శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో మహా శివరాత్రి సందర్భంగా నిర్వహించిన ఊరేగింపునకు విద్యుత్తు షాక్‌ తగిలింది. దీంతో విద్యుత్తు ఘాతానికి గురై 14 మంది పిల్లలు గాయపడ్డారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. వివరాలు ఇలా ఉన్నాయి..

శుక్రవారం ఉదయం పదకొండున్నర గంటల ప్రాంతంలో మహాశివరాత్రి సందర్భంగా పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ఒక బాలుడు 22 అడుగుల ఎత్తు ఉన్న జెండా పట్టుకొని నడిచాడు. అయితే.. ఇనుపరాడ్‌తో కూడిన జెండా.. హై టెన్షన్ వైరుకు తాకడంతో అతడికి కరెంటు షాక్‌ కొట్టిందని కోట సిటీ ఎస్పీ అమృత దుహాన్ తెలిపారు. జెండా పట్టుకున్న బాలుడికి తీవ్ర గాయాలయ్యాయని పేర్కొన్నారు. అతని దరిదాపుల్లోవున్న మరో బాలుడు సగం శరీరం కాలిపోయింది. వారిద్దరినీ రక్షించే క్రమంలో మరో 12 మంది కూడా కరెంటు షాక్‌ తగిలింది. వీరికి సుమారు 50 శాతం వరకూ శరీరం కాలిపోయిందని తెలిపారు. గాయపడిన బాలుర వయసు 10 నుంచి 16 ఏళ్ల మధ్య ఉంటుందని చెబుతున్నారు. ఈ సంఘటన కునహరి పోలీస్ స్టేషన్ పరిధిలోని సకాటవుర ఏరియాలో జరిగింది.