న్యూఢిల్లీ : పార్లమెంట్ ఉభయసభల్లో ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో ముగ్గురు ఎంపీలను లోక్‌సభ నుంచి సస్పెండ్ అయ్యారు. ఇవాళ సస్పెండ్ అయిన వారిలో నకుల్ నాథ్, దీపక్ బేజ్, డీకే సురేశ్ ఉన్నారు. దీంతో లోక్‌సభ నుంచి సస్పెండ్ అయిన ఎంపీల సంఖ్య 100కు చేరింది. నిన్న ఇద్దరు ఎంపీలను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఉభయసభల్లో కలిపి ఇప్పటి వరకు 146 మంది ఎంపీలపై వేటు పడింది. పార్లమెంట్ చరిత్రలోనే ఈ స్థాయిలో ఎంపీలు సస్పెండ్ అవడం ఇదే తొలిసారి అని పలువురు నాయకులు పేర్కొన్నారు.
డిసెంబర్ 14వ తేదీ నుంచి ఎంపీల సస్పెన్షన్ కొనసాగుతూనే ఉంది. పార్లమెంట్ భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయసభల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని విపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై నిరసన తెలుపుతున్న విపక్ష ఎంపీలను సస్పెండ్ చేస్తోంది అధికార పక్షం.