Site icon vidhaatha

డిసెంబర్‌ నుంచి జరుగనున్న మార్పులు ఇవే..! అవేంటో ఒకసారి లుక్కేయండి..!

విధాత‌: రేపటి నవంబర్‌ నెల ముగియనున్నది. డిసెంబర్‌ మాసం మొదలనుకానున్నది. అయితే, ప్రతి నెలాలో మాదిరిగానే డిసెంబర్‌లోనూ పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. బ్యాకింగ్‌ రంగంతో పాటు టెలికారం రంగంలో ఈ మార్పులు ఉండబోతున్నాయి. అలాగే, ఇంట్లోని వంట గది సైతం ప్రభావమయ్యే అవకాశాలు కూడా ఉండనున్నాయి. అలాగే సీనియర్‌ సిటిజన్లకు సైతం కీలకం కానున్నది. డిసెంబర్‌ ఒకటో తేదీ నుంచి కొన్ని రూల్స్‌ మారబోతున్నాయి. కొన్ని స్కీమ్స్‌కు సంబంధించి గడువు ముగియబోన్నది అవేంటో ఒకసారి పరిశీలిద్దాం రండి..!


హెచ్‌డీఎఫ్‌సీ క్రిడెట్‌కార్డుల్లో మార్పులు


ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వినియోగం భారీగా పెరిగింది. అన్ని బ్యాంకులు క్రెడిట్‌కార్డులపై బ్యాంకులు వివిధ సౌకర్యాలు కల్పిస్తున్న విషయం తెలిసిందే. అయితే, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ రెగాలియా క్రిడిట్‌కార్డులో పలు మార్పులు చేసింది. లాంజ్‌ యాక్సిస్‌ ప్రోగ్రామ్‌లో మార్పులు డిసెంబర్‌ నుంచి అమలుకాబోతున్నాయి. కార్డు వినియోగాన్ని బట్టి లాంజ్‌ యాక్సెస్‌ ప్రోగ్రామ్‌ ఆధారపడి ఉంటుంది.


ఏదైనా క్యాలెండర్‌ ఇయర్‌ క్వార్టర్‌లో (జనవరి- మార్చి, ఏప్రిల్- జూన్‌, జులై-సెప్టెంబర్, అక్టోబర్- డిసెంబర్) రూ.లక్ష లేదా అంతకంటే ఎక్కువగా కార్డు ద్వారా లావాదేవీలు జరుపాల్సి ఉంటుంది. రూ.లక్షకుపైగా లావాదేవీలు జరిపినట్లయితే క్వార్టర్లీ మైల్‌స్టోన్ బెనిఫిట్స్ కింద మీరు గరిష్టంగా 2 కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ వోచర్లు అందుకుంటారు.


ఎస్‌బీఐ అమృత్‌ కలాష్‌ గడువు


దేశంలోనే ప్రముఖ ప్రభుత్వ రంగ బ్యాంక్‌ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత్ కలాష్ స్పెషల్ ఎఫ్‌డీలో స్కీమ్‌ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. గతంలోనే ఈ పథకం గడువు ముగియాల్సి ఉండగా.. బ్యాంకు డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది. 7.10 శాతం కంటే ఎక్కువ వడ్డీ రేట్లు ఉన్న ఎఫ్‌డీలు పొందే వీలున్నది. ఇది 400 రోజుల ప్రత్యేక ఎఫ్‌డీ పథకం. ఇందులో పెట్టుబడిపై సామాన్యులకు 7.10 శాతం, సీనియర్ సిటిజన్లకు పెట్టుబడిపై 7.60 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఆగస్టులోనే పథకం గడువు ముగియగా.. డిసెంబర్‌ 31 వరకు పొడిగించింది. స్కీమ్‌ ద్వారా అందరికీ ప్రయోజనం కల్పించాలని గడువును పొడిగించింది.


ఆధార్‌ అప్‌డేట్‌ గడువు..


పదేళ్లుగా ఆధార్‌కార్డులో మార్పులు చేయనివారు అప్‌డేట్‌ చేసుకోవాలని యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా కోరిన విషయం తెలిసిందే. మార్పులు చేసుకునేందుకు ఉచితంగానే సర్వీసులు అందించనున్నట్లు పేర్కొంది. ఉచితంగా అప్‌డేట్‌ గడువు డిసెంబర్‌ 14న ముగియనున్నది. ఆ తర్వాత ఆధార్‌ అప్‌డేట్‌ కోసం డబ్బులు చెల్లించాల్సి రానున్నది. గతంలో సెప్టెంబర్‌ 14తోనే గడువు ముగియగా మూడు నెలలు పొడిగించింది. వినియోగదారుల నుంచి సానుకూల స్పందన వస్తున్న నేపథ్యంలోనే నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం తెలిపింది.


యూపీఐ ఐడీల డీయాక్టివేషన్‌..


నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గూగుల్‌ పే, పేటీఎం, ఫోనపే మొదలైన చెల్లింపు యాప్‌లను, బ్యాంకులను ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం పాటు యాక్టివ్‌గా లేని యూపీఐ ఐడీ నంబర్లను డీయాక్టివేట్‌ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు నవంబర్ 7, 2023న ఎన్‌సీపీఐ సర్క్యూలర్‌ను జారీ చేసింది. ఇందులో భాగంగా డిసెంబర్‌ 31 వరకు మార్గదర్శకాలను అమలు చేయాలని ఆదేశించింది.


మొబైల్ నెంబర్స్ మార్చుకునే సమయంలో అప్పటికే ఉన్న నెంబర్స్ డీయాక్టివేట్ చేయకపోతే వారికి సంబంధం లేని కొన్ని ఖాతాలకు నగదు బదిలీ అయ్యే అవకాశం ఉందని ఎన్‌పీసీఐ భావించి ఈ నిర్ణయం తీసుకున్నది. టెలికం ఆపరేటర్లు పాత నెంబర్స్ వేరొకరికి అందిస్తుండడంతో ఈ ప్రమాదం జరిగే అవకాశం ఉందని.. ఈ క్రమంలో వినియోగంలో లేని వాటిని డీయాక్టివేట్ చేస్తే ఈ సమస్య జరగదని పేర్కొంది.


బ్యాంకులకు ఆర్బీఐ మార్గదర్శకాలు..


డిసెంబర్ ఒకటి బ్యాంకులకు ఆర్‌బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది. రుణాన్ని తిరిగి చెల్లించిన తర్వాత గ్యారంటీకి బదులుగా ఉంచిన పత్రాలను సకాలంలో తిరిగి ఇవ్వని పక్షంలో బ్యాంకులకు జరిమానా విధించనున్నది. ఈ జరిమానాను నెలకు రూ.5వేల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. పత్రాలు పోయినట్లయితే మరో 30 రోజులు గడువు పొందుతారు.


కాగా.. చాలా మంది ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు లోన్‌ తీసుకుంటుటారు. ఆస్తులను తాకట్టు పెట్టి లోన్‌ తీసుకుంటారు. లోన్‌ తిరిగి చెల్లించిన తర్వాత ప్రాపర్టీ డాక్యుమెంట్లను తీసుకునే ప్రాసెస్‌ను క్రమబద్ధీకరించేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) చర్యలు చేపట్టింది. వినియోగదారులకు ఎలాంటి సమస్యలు ఎదురుకాకుండా చూసుకునేందుకు కొత్త గైడ్‌లైన్స్‌ రూపొందించింది.


గ్యాస్ సిలిండర్ ధర పెరుగుతుందా? తగ్గుతుందా?


డిసెంబర్‌ నెలలో గ్యాస్ సిలిండర్ ధరలు మారబోతున్నాయి. గత కొద్దినెలలుగా డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. కానీ, వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరల్లో మార్పులు పెరుగుతూ వస్తున్నాయి. నవంబర్ నెల మొదటి తేదీన వాణిజ్య సిలిండర్ ధరను చమురు కంపెనీలు పెంచాయి. ఆ తర్వాత ధర రూ.2000కి పడిపోయింది.


ఆ తర్వాత ధరలు తగ్గాయి. నెలలో కూడా సిలిండర్ల ధరలు తగ్గుతాయా? పెరుగుతుదాయా..? లేదంటే నిలకడగా ఉంటాయా? చూడాలి. ఎప్పటికప్పుడు చమురు కంపెనీలు ధరలను పరిశీలిస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే ధరలు పెరుగుతూ తగ్గుతూ వస్తాయి. వీటితో పాటు ఇంకా చాలా రకాల మార్పులు జరుగబోతున్నాయి.

Exit mobile version