Gruha Lakshmi | గృహ‌ల‌క్ష్మి ప‌థ‌కంలో దివ్యాంగుల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్లు..!

Gruha Lakshmi | రాష్ట్రంలోని దివ్యాంగుల‌కు సీఎం కేసీఆర్ స‌ర్కార్ శుభ‌వార్త వినిపించింది. కేసీఆర్ స‌ర్కార్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న గృహ‌ల‌క్ష్మి ప‌థ‌కంలో దివ్యాంగుల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్లు వ‌ర్తింప‌జేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. ఈ ప‌థ‌కం కింద సొంత స్థ‌లం ఉన్న నిరుపేద‌లు ఇల్లు నిర్మించుకునేందుకు ప్ర‌భుత్వం రూ. 3 ల‌క్ష‌ల చొప్పున సాయం చేయ‌నున్న విష‌యం విదిత‌మే. ఈ ప‌థ‌కంలో దివ్యాంగుల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌ని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేష‌న్ చైర్మ‌న్ వాసుదేవ‌రెడ్డి […]

  • Publish Date - August 2, 2023 / 01:20 AM IST

Gruha Lakshmi | రాష్ట్రంలోని దివ్యాంగుల‌కు సీఎం కేసీఆర్ స‌ర్కార్ శుభ‌వార్త వినిపించింది. కేసీఆర్ స‌ర్కార్ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న గృహ‌ల‌క్ష్మి ప‌థ‌కంలో దివ్యాంగుల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్లు వ‌ర్తింప‌జేస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు.

ఈ ప‌థ‌కం కింద సొంత స్థ‌లం ఉన్న నిరుపేద‌లు ఇల్లు నిర్మించుకునేందుకు ప్ర‌భుత్వం రూ. 3 ల‌క్ష‌ల చొప్పున సాయం చేయ‌నున్న విష‌యం విదిత‌మే. ఈ ప‌థ‌కంలో దివ్యాంగుల‌కు 5 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయాల‌ని రాష్ట్ర దివ్యాంగుల కార్పొరేష‌న్ చైర్మ‌న్ వాసుదేవ‌రెడ్డి ఇటీవ‌ల సీఎం కేసీఆర్‌ను క‌లిసి విజ్ఞ‌ప్తి చేయ‌గా, ఆయ‌న సానుకూలంగా స్పందించారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో వాసుదేవ‌రెడ్డి సీఎం కేసీఆర్‌కు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలిపారు.

గృహ‌ల‌క్ష్మి ప‌థ‌కం కింద ఒక్కో నియోజ‌క‌వ‌ర్గానికి 3 వేల చొప్పున ఇండ్లు నిర్మించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన సంగ‌తి తెలిసిందే. ప‌థ‌కానికి సంబంధించిన మార్గ‌ద‌ర్శ‌కాల్లో ఎస్సీల‌కు 20 శాతం, ఎస్టీల‌కు 10 శాతం, బీసీ, మైనార్టీల‌కు 50 శాతం రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేయ‌నున్నారు.

Latest News