Site icon vidhaatha

Tirumala | నడకమార్గంలో చిరుతలను బంధించేందుకు 500 ట్రాప్ కెమెరాలు

Tirumala | విధాత‌: తిరుమల భక్తులపై చిరుత దాడి ఘటన నేపథ్యంలో టీటీడీ అప్రమత్తమైంది. అలిపిరి నుంచి నడక మార్గంలో చిరుతలను గుర్తించేందుకు 500 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేయ‌నున్నారు. భక్తుల రక్షణగా కర్రలు ఇచ్చి పంపుతున్నారు. నడక దారిలో పులి ఎదురుపడితే తరిమి కొట్టడానికి టీటీడీ ఈ కర్రలు సిద్ధం చేసింది.

మరోవైపు నడక మార్గంలో 30 మంది నిపుణుల బృందాలతో టీటీడీ (TTD)పర్యవేక్షిస్తోంది. ఈ బృందాలు చిరుత కదలికలను గుర్తించి బోన్‌లు ఏర్పాటు చేయనున్నారు. కాగా భక్తుల రక్షణే తమకు ముఖ్యమన్న టీటీడీ చైర్మన్ భూమన.. అలిపిరిలో ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే పిల్లలకు అనుమతిస్తామని వెల్లడించారు. ఘాట్ రోడ్డులో సాయంత్రం ఆరు గంటల వరకే టూవీలర్స్‌కు అనుమతి ఇవ్వగా, పెద్దలకు రాత్రి పది గంటల వరకే నడకదారిలో అనుమతి ఉంటుందని తెలిపింది.

నైపుణ్యం కలిగిన ఫారెస్ట్ (Forest) సిబ్బందిని సెక్యూరిటీగా నియమించనున్నారు. త్వరలో భక్తుల భద్రత కోసం డ్రోన్లు వాడాలని టీటీడీ బోర్డు నిర్ణయించిందని చెప్పారు. భద్రతపై భక్తులకూ అవగాహన కల్పిస్తూ, అలిపిరి, గాలిగోపురం, 7వ మైలురాయి వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. భక్తులు గుంపులుగా వెళ్లాలని సూచించారు. నడక దారిలో బేస్ క్యాంపు, మెడికల్ క్యాంపులు, ఫోకస్ లైట్లు ఏర్పాటు చేయనున్నారు.

Exit mobile version