Site icon vidhaatha

దేవరగట్టు: కర్రల సమరంలో 70 మందికి గాయాలు

విధాత‌: ఏపీలోని కర్నూలు జిల్లాలోని హోళగుంద మండలం దేవరగట్టులో నిర్వహించే బన్నీ ఉత్సవాలు ముగిశాయి. ఈసారి కూడా దేవరగట్టు కర్రల సమరంలో రక్తం చిందింది. ప్రతి ఏడాది దసరా రోజున శ్రీ మాళ మల్లేశ్వర స్వామికి నిర్వహించే వేడుకల్లో భాగంగా జరిగే ఈ కర్రల సమరం ఈ ఏడాది వర్షం కారణంగా కొంచెం ఆలస్యంగా ప్రారంభమైంది. ఉత్సవ విగ్రహాల కోసం 10 గ్రామాల ప్రజలు కొట్టుకున్నారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కర్రల సమరం సాగింది.

ఈ కర్రల సమరంలో దాదాపు 70 మంది భక్తులకు గాయాలయ్యాయి. పలువురికి తలలు పగిలాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారికి ఆస్పత్రిలో తాత్కాలిక చికిత్స జరుగుతోంది. మెరుగైన చికిత్స కోసం పలువురిని ఆదోని ఆస్పత్రికి తరలించారు.

అంతేకాకుండా, ఆ మార్గంలో భారీగా వాహన రాకపోకలు నిలిచిపోవడంతో పాటు, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ కర్రల సమరం ఉత్సవాన్ని ప్రత్యక్షంగా 2 లక్షల మంది తిలకించారు. కాగా.. ఈ ఉత్సవాలు చూసేందుకు వచ్చి వీరారెడ్డి (17) అనే యువకుడు గుండె పోటుతో మృతి చెందాడు. మృతుడు ఆదోని మండలం ఎడ్డవల్లి గ్రామ వాసిగా అధికారులు గుర్తించారు.

Exit mobile version