Odisha | రెండు గంట‌ల్లో 62 వేల పిడుగులు.. 12 మంది మృతి

Odisha | ఒడిశాలో పిడుగుల వ‌ర్షం ప‌డింది. రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో ఏకంగా 62,350 పిడుగులు ప‌డ్డాయి. ఈ పిడుగుల ధాటికి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వాతావ‌ర‌ణ మార్పులతో పాటు వివిధ అంశాలే ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌ని శాస్త్ర‌వేత్తలు పేర్కొన్నారు. సెప్టెంబ‌ర్ 3, 4 తేదీల్లో అనేక పిడుగులు ప‌డ్డాయ‌ని ఒడిశా అధికారులు వెల్ల‌డించారు. అయితే శ‌నివారం ఒక్క‌రోజే 62 వేల పిడుగులు ప‌డిన‌ట్లు అధికారులు ధృవీక‌రించారు. పిడుగుల ధాటికి 14 మంది తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు […]

  • Publish Date - September 4, 2023 / 10:43 AM IST

Odisha |

ఒడిశాలో పిడుగుల వ‌ర్షం ప‌డింది. రెండు గంట‌ల వ్య‌వ‌ధిలో ఏకంగా 62,350 పిడుగులు ప‌డ్డాయి. ఈ పిడుగుల ధాటికి 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వాతావ‌ర‌ణ మార్పులతో పాటు వివిధ అంశాలే ఈ ఘ‌ట‌న‌కు కార‌ణ‌మ‌ని శాస్త్ర‌వేత్తలు పేర్కొన్నారు.

సెప్టెంబ‌ర్ 3, 4 తేదీల్లో అనేక పిడుగులు ప‌డ్డాయ‌ని ఒడిశా అధికారులు వెల్ల‌డించారు. అయితే శ‌నివారం ఒక్క‌రోజే 62 వేల పిడుగులు ప‌డిన‌ట్లు అధికారులు ధృవీక‌రించారు. పిడుగుల ధాటికి 14 మంది తీవ్రంగా గాయ‌ప‌డిన‌ట్లు పేర్కొన్నారు. ప‌లుచోట్ల మూగ‌జీవాలు కూడా మృత్యువాత ప‌డ్డాయి.

సెప్టెంబ‌ర్ 7వ తేదీ వ‌ర‌కు ఇవే ప‌రిస్థితులు కొన‌సాగే అవ‌కాశం ఉన్న‌ట్లు భార‌త వాతావ‌ర‌ణ శాఖ తెలిపింది. దీంతో ఒడిశా వాసులు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్ప‌డిన వాయుగుండం మ‌రో 48 గంట‌ల్లో అల్ప‌పీడ‌నంగా మారే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. ఈ కార‌ణంగా ఒడిశా వ్యాప్తంగా భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని పేర్కొంది.

ఈక్ర‌మంలో ఆయా ప్రాంతాల్లో ఎల్లో అల‌ర్ట్ జారీ చేశారు అధికారులు. ఇక గ‌డిచిన 11 ఏండ్ల‌లో ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా 3,790 మంది పిడుగుల‌కు బ‌లైన‌ట్లు నివేదిక‌లు పేర్కొన్నాయి. వాతావ‌ర‌ణంలోని ఎగువ భాగంలో తేమ శాతం పెరిగిన‌ప్పుడు, పిడుగులు అధికంగా ప‌డే అవ‌కాశం ఉంద‌ని సైంటిస్ట్ ఉమాశంక‌ర్ దాస్ తెలిపారు.

Latest News