Site icon vidhaatha

HYD: జూబ్లీహిల్స్‌లో రూ. 89.92 లక్షలు సీజ్

Hyderabad | విధాత: హైదరాబాద్ నగరంలో మరోసారి భారీగా నగదు పట్టుబడింది. జూబ్లీహిల్స్‌లోని రోడ్డు నంబర్ 71లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆదివారం తనిఖీలు నిర్వహించారు.

తనిఖీల్లో భాగంగా మహీంద్రా థార్ వాహనంలో తరలిస్తున్న నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కారులో నుంచి రూ. 89.92 లక్షలు స్వాధీనం చేసుకున్నామని పోలీసులు పేర్కొన్నారు. నగదును తరలిస్తున్న కారు TS 27 D 7777 గా గుర్తించారు.

ఈ నగదును ఎక్కడ్నుంచి ఎక్కడికి తరలిస్తున్నారనే విషయం తెలియాల్సి ఉంది. అయితే కారులో నగదును తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని జూబ్లీహిల్స్ పోలీసులకు అప్పగించారు.

ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. నిన్న రాత్రి 11 గంటలకు నగదు పట్టుబడినట్లు టాస్క్ ఫోర్స్ పోలీసులు తమకు సమాచారం అందించారని తెలిపారు. మహీంద్రా థార్ వాహనంలో తరలిస్తున్న రూ. 89.92 లక్షల నగదును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

Exit mobile version