Site icon vidhaatha

Train Accident Just Missing| తృటిలో తప్పిన భారీ రైలు ప్రమాదం..బ్రిడ్జి కింద ట్యాంకర్ లో మంటలు..పైన రైలు

విధాత : ఘోర రైలు ప్రమాదం తృటిలో తప్పింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జీ.ఎర్రగుడి సమీపంలో రైల్వై అండర్ పాస్ బ్రిడ్జి నుంచి వెలుతున్నబెల్లం పానకం ట్యాంకర్ లో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. దీంతో డ్రైవర్ రైల్వే బ్రిడ్జి కిందనే ట్యాంకర్ ను ఆపేసి కిందకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. అయితే బ్రిడ్జి కింద ఉన్న ట్యాంకర్ లో మంటలు భారీగా చెలరేగుతున్న సమయంలోనే బ్రిడ్జిపై నుంచి రైలు వెళ్లింది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ట్యాంకర్ పేలడంగాని..మంటలు బ్రిడ్జిపైకి ఎగిసిపడటంగాని జరగకపోవడంతో పెను ప్రమాదం తప్పినట్లయ్యింది. అయితే ట్యాంకర్ లో చెలరేగిన మంటలను రైలు నుంచి గమనించిన ప్రయాణికులు ప్రాణభయంతో కేకలు పెట్టారు. ఇక ప్రాణాపాయంలో పడ్డాట్లేనని భయపడ్డారు. అయితే వచ్చిన వేగంలోనే సురక్షితంగా బ్రిడ్జి దాటిపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

ఉహించని రీతిలో జరిగిన ట్యాంకర్ ప్రమాదంపై రైల్వే అధికారులకు సమాచారం లేకపోవడంతో రైలు యధాతధంగా ఆ మార్గంలో వెళ్లిపోయింది. అనంతరం ట్యాంకర్ ప్రమాద ఘటన సమాచారం తెలుసుకున్న రైల్వే అధికారులు ఆ మార్గంలో రైళ్లను కొంత సేపు నిలిపివేసి..పరిస్థితిపై విచారణ చేసిన అనంతరం రైళ్లను అనుమతించారు.

Exit mobile version