విధాత బ్యూరో, కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. తాజాగా చందుర్తి మండల కేంద్రంలో మరో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.
మాల్యాల గ్రామంలో జరిగిన హత్య ఘటన మరువక ముందే మరో హత్య చోటుచేసుకోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.చందుర్తి మండల కేంద్రంలో వినాయక మండపం ఎదుట నిద్రిస్తున్న గంగారాం(70)ను గుర్తుతెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు.
గంగారాం స్థానిక హోటల్లో పని చేస్తూ ఉపాధి పొందేవాడు. బుధవారం ఉదయం ఆయన రక్తం మడుగులో పడిఉండగా స్థానికులు గుర్తించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.