Site icon vidhaatha

PM Modi | క‌ర్ణాట‌క‌లో మోదీపైకి మొబైల్ ఫోన్ విసిరివేత‌.. వీడియో

PM Modi |

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఉన్న ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపైకి ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి మొబైల్ ఫోన్‌ను విసిరేశాడు. ఈ ఘ‌ట‌న ఆదివారం మైసూర్‌లో వెలుగు చూసింది. ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది.

మైసూర్‌లో బీజేపీ నిర్వ‌హించిన రోడ్ షోలో మోదీ పాల్గొన్నారు. ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తుండ‌గా.. మోదీ వెనుకాల నుంచి ఓ మొబైల్ ఫోన్‌ను ఆయ‌న‌పైకి విసిరేశాడు. అది మోదీకి త‌గ‌ల్లేదు. మోదీ నిల్చున్న వాహ‌నం బొనెట్‌పై మొబైల్ ప‌డిపోయింది.

మొబైల్ ఫోన్ బొనెట్‌పై ప‌డ‌టాన్ని ఎస్‌పీజీ సిబ్బంది గ‌మ‌నించిన‌ప్ప‌టికీ, ఆ వాహ‌నాన్ని ఆప‌కుండా ముందుకు పోనిచ్చారు. మోదీపైకి మొబైల్ ఎవ‌రు విసిరేశార‌నే కోణంలో ఆయ‌న సెక్యూరిటీ సిబ్బంది ద‌ర్యాప్తు చేప‌ట్టింది.

అత్యుత్సాహంతోనే విసిరేసింద‌ట‌..

మోదీ సెక్యూరిటీ సిబ్బంది చేప‌ట్టిన ద‌ర్యాప్తులో.. మొబైల్ ఫోన్‌ను విసిరేసిన వ్య‌క్తిని గుర్తించారు. ఫోన్ విసిరేసింది బీజేపీ మ‌హిళా కార్య‌క‌ర్త అని తేలింది. మోదీ పైకి పూలు చ‌ల్లే క్ర‌మంలో అత్యుత్సాహంతో మొబైల్‌ను సైతం విసిరిన‌ట్లు ద‌ర్యాప్తులో స్ప‌ష్ట‌మైంది. అనంత‌రం ఆ మ‌హిళా కార్య‌క‌ర్త‌ను ఎస్‌పీజీ సిబ్బంది వ‌దిలేశారు.

Exit mobile version