Site icon vidhaatha

Nellore | ఇంజినీరింగ్ కాలేజీలో విద్యార్థిని మృతి.. ప‌క్క‌నే ఆరు నెల‌ల పిండం..

Nellore | ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఓ విద్యార్థిని అనుమానాస్ప‌ద‌స్థితిలో మృతి చెందింది. ఆమె ప‌క్క‌నే ఆరు నెల‌ల పిండం ఉండ‌టాన్ని చూసి తోటి విద్యార్థులు షాక్ అయ్యారు. ఈ ఘ‌ట‌న నెల్లూరు జిల్లాలోని ఓ ప్ర‌యివేటు ఇంజినీరింగ్ కాలేజీలో 11వ తేదీన చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. మ‌ర్రిపాడు మండ‌లానికి చెందిన ఓ 19 ఏండ్ల యువ‌తి బీటెక్ సెకండియ‌ర్ చ‌దువుతోంది. ఏప్రిల్ 11వ తేదీన విద్యార్థులంద‌రూ గ్రౌండ్‌లో ఉండ‌గా, ఆ యువ‌తి ఒక్క‌రే త‌ర‌గ‌తి గ‌దిలో ఉంది. డోర్ లోప‌ల లాక్ చేసుకుంది. అయితే ఆమె ఎంత‌సేప‌టికి కూడా బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో అనుమానం వ‌చ్చి.. తోటి విద్యార్థులంతా క్లాస్ రూమ్ వ‌ద్ద‌కు వెళ్లారు. త‌లుపులు ప‌గుల‌గొట్టి చూడ‌గా, తీవ్ర ర‌క్త‌స్రావంతో యువ‌తి అప‌స్మార‌క స్థితిలో ప‌డిపోయి ఉంది. ఆమె ప‌క్క‌నే ఆరు నెల‌ల పిండాన్ని గుర్తించారు విద్యార్థులు. దీంతో హుటాహుటిన యువ‌తిని, పిండాన్ని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అప్ప‌టికే యువ‌తి మృతి చెందిన‌ట్లు వైద్యులు నిర్ధారించారు.

యువ‌తి తండ్రి ఫిర్యాదు మేర‌కు నెల్లూరు రూర‌ల్ పోలీసులు కేసు న‌మోదు చేసుకుని ద‌ర్యాప్తు చేప‌ట్టారు. క్లాస్ రూమ్‌లోనే అబార్ష‌న్ అయ్యిందా..? లేదా వీడియో ద్వారా త‌న‌కు తానే అబార్ష‌న్ చేసుకుందా..? అన్న కోణంలో పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. అయితే అనంత‌సాగరానికి చెందిన కారు డ్రైవ‌ర్‌తో ఆమెకు ప‌రిచ‌యం ఉన్న‌ట్లు ఫోన్ కాల్ డేటా ద్వారా వెల్ల‌డైంది. ఈ కేసును క్షేత్ర‌స్థాయిలో విచారిస్తున్న‌ట్లు రూర‌ల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

Exit mobile version