Site icon vidhaatha

తహసీల్దార్ ఇంటిపై ఏసీబీ దాడులు.. ట్రంకు పెట్టెల్లో డబ్బుల కట్టలు, కుప్పలు గా బంగారు నగలు


విధాత బ్యూరో, ఉమ్మడి నల్గొండ: మర్రిగూడ తహసీల్దార్ మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు చేశారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని అనేక ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ అధికారులు రంగంలోకి దిగారు. తహసీల్దార్ మహేందర్ రెడ్డి కి సంబంధించిన 15 చోట్లలో ఏకకాలంలో దాడులకు దిగారు.



ఈ క్రమంలో మహేందర్ రెడ్డి ఇంట్లో లభ్యమైన నోట్ల కట్టలు, బంగారు నగలు కుప్పలు తెప్పలుగా బయటపడడంతో ఏసీబీ అధికారులు విస్తుపోతున్నారు. రెండు ఇనుప పెట్టెల్లో నోట్ల కట్టలు దర్శనమివ్వడంతో పాటు ఇంట్లో కిలోల కొద్దీ బంగారం ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇంకా దాడులు,సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పూర్తి వివరాలు తెలియరావాల్సి ఉంది. కాగా మంచిరెడ్డి మహేందర్ రెడ్డి ఇటీవలే కందుకూరు నుంచి మర్రిగూడ మండలానికి తహసీల్దార్‌గా బదిలీపై వచ్చారు.



మర్రిగూడ తహసిల్దార్ మహేందర్ రెడ్డి అరెస్ట్

ఏసీబీ అధికారుల వలలో భారీ అవినీతి తిమింగళం చిక్కింది. నల్గొండ జిల్లా మర్రిగూడ తహసిల్దార్ మాచిరెడ్డి మహేందర్ రెడ్డి ఇంటిపై ఏసీబీ అధికారులు శనివారం దాడులు చేపట్టారు. రంగారెడ్డి జిల్లా బి.ఎన్.రెడ్డి పరిధిలోని షిరిడి సాయి నగర్లోని ఆయన నివాసంతో పాటు ఏకకాలంలో ఆయన బంధువులు, అనుచరులకు సంబంధించిన 15 చోట్ల అధికారులు దాడులు నిర్వహించారు.



ఆయన నివాసంలో ట్రంకు పెట్టెలలో రెండు కోట్ల 7 లక్షల నగడుతో పాటు మరో రెండున్నర కోట్ల విలువైన బంగారం ఇతర విలువైన వస్తువులు, ఆస్తి, భూపత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు ఏసిబి అధికారులు వెల్లడించారు.


అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని, ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని అనేక ఆరోపణలతో రంగంలోకి దిగిన అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో మహేందర్ రెడ్డి ఇంట్లో లభ్యమైన నోట్ల కట్టలు బంగారు నగలు కుప్పలుగా బయటపడడంతో ఏసీబీ అధికారులు విస్తుపోయారు.



రెండు ఇనుప పెట్టెలలో నోట్ల కట్టలు దర్శనం ఇవ్వడంతో పాటు ఇంట్లో కిలోల కొద్ది బంగారం ఏసీబీ అధికారులు గుర్తించారు. ఇటీవలే మంచిరెడ్డి మహేందర్ రెడ్డి కందుకూరు నుంచి మర్రిగూడ మండలానికి తాసిల్దార్ గా బదిలీపై వచ్చారు. అవినీతి అధికారి మహేందర్ రెడ్డిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించనున్నట్లు ఏసిపి అధికారులు తెలిపారు. కేసును మరింత లోతుగా విచారణ జరపనున్నట్లు మీడియాకు తెలిపారు.

Exit mobile version