Site icon vidhaatha

Show Time: న‌వీన్‌చంద్ర మ‌రో క్రైమ్ థ్రిల్ల‌ర్‌.. ‘షో టైమ్’

న‌వీన్‌చంద్ర (Naveen Chandra), కామాక్షి భాస్క‌ర్ల (kamakshi bhaskarla) జంట‌గా ‘షో టైమ్’ (SHOW TIME)అనే సినిమా తెర‌కెక్కుతోంది. ప్ర‌ఖ్యాత ఎకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ (AK Entertainments) స‌మ‌ర్ఫ‌ణ‌లో స్కైలైన్ మూవీస్ (Skyline Movies) ప్రొడక్షన్ నెం.1 పతాకంపై కిషోర్ గరికిపాటి ఈ మూవీని నిర్మిస్తున్నారు. మదన్ దక్షిణా మూర్తి (Madhan Dhakshinamoorthy) దర్శకత్వం వహిస్తుండ‌గా శేఖ‌ర్ చంద్ర (Shekar Chandra) సంగీతం అందిస్తున్నాడు. ఉగాది ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని ఆదివారం మేక‌ర్స్ ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ రిలీజ్ చేశారు.

తాజాగా రిలీజ్ చేసిన ఈ ఫ‌స్ట్ లుక్‌ను చూస్తుంటే న్ఈన్ ఈసారి అదిరిపోయే కంటెంట్‌తో వ‌స్తున్న‌ట్లు అర్థ‌మ‌వుతోంది. కుటుంబం అనుకోని ఇబ్బందుల్లో ప‌డితే వాటి నుంచి ఎలా బయటపడ్డారు, ఓ పోలీస్ అధికారి నుంచి నవీన్ తన భార్య, కూతురును ఎలా కాపాడుకున్నాడనే నేప‌థ్యంలో మంచి థ్రిల్లింగ్ అంశాల‌తో సినిమాను రూపొందిస్తున్న‌ట్లు తెలుస్తోంది. ప్రేక్షకులను ఆకట్టుకునేలా గ్రిప్పింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయని, టాలీవుడ్‌లో ఇది ఓ డిఫరెంట్ మూవీ అవుతుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

ఇటీవ‌లే న‌వీన్ న‌టించిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు దాదాపు అన్నీ థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లో వ‌చ్చి మంచి విజ‌యం సాధించ‌డ‌మే గాక ఆయ‌న‌కు త‌మిళ నాట సైతం మంచి గుర్తింపును తీసుకువ‌చ్చాయి. అదే క్ర‌మంలో ఇప్ప‌డు న‌టించిన షోటైమ్ కూడా థ్రిల్ల‌ర్ జాన‌ర్‌లోనే రానుండ‌డంతో ప్రేక్ష‌కుల‌లో ఈ మూవీపై అంచ‌నాలు పెరుగుతున్నాయి. దానికి తోడు ఏకే ఎంట‌ర్టైన్ మెంట్స్ అనీల్ సుంక‌ర (Anil Sunkara) ఈ సినిమాను స‌మ‌ర్పిస్తుండ‌డంతో ప్రేక్ష‌కుల‌లోనూ క్రేజ్ ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంఉట‌న్న ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ఇత‌ర‌ మరిన్ని వివరాలు త్వ‌ర‌లో ప్రకటించనున్నారు.

Exit mobile version