Site icon vidhaatha

Ester Noronha | బాబోయ్.. ఇంత టాలెంటా? ఇన్నాళ్లూ ఎందుకు కామ్‌గా ఉందో మరి?

Ester Noronha |

ఏదైనా సరే.. ఎక్కడ పారేసుకుంటే సరిగ్గా అక్కడే వెతికితే ఫలితం ఉంటుంది అంటారు.. ప్రస్తుతం అచ్చం అలానే నటి ఎస్తేర్ అదే పని చేస్తుంది. తెలుగు సినిమాల్లో హీరోయిన్‌గా, కేరక్టర్ ఆర్టిస్ట్‌గా అదృష్టాన్ని పరీక్షించుకున్నా ఫలితం లేకపోయే సరికి ఇప్పుడు సరికొత్త మార్గాన్ని ఎన్నుకుంది ఎస్తేర్.

గాయకుడు నోయల్‌తో ప్రేమ, పెళ్ళి తర్వాత విడాకులు వెంట వెంటనే జరిగి పోయాకా మళ్ళీ పోగొట్టుకున్న చోటనే అదృష్టాన్ని వెతుక్కునే పనిలో కాస్త బిజీగానే ఉంది ఎస్తేర్. ప్రస్తుతం ఎస్తేర్ పెద్ద సర్‌ప్రైజ్ ఇచ్చింది. ‘1000 అబద్దాలు’ తర్వాత ఎటూ సినిమాలో క్లిక్ అవలేదు కదా మరో పని చూసుకుంటుందని అంతా అనుకుంటే ఎస్తేర్ మాత్రం ట్విస్ట్ ఇచ్చింది.

తనే ఓ సినిమా స్వయంగా నిర్మిస్తుందట. దీనికి నటిగా మాత్రమే కాకుండా.. మల్టీ ట్యాలెంటెడ్‌ అనిపించుకోవాలనే ప్రయత్నంలో ఉన్నానని చెప్పుకొచ్చింది. ఏకంగా మెగాఫోన్‌ చేత పట్టుకుంటున్నట్టుగా ప్రకటించింది. వివరాల్లోకి వెళితే.. కన్నడలో ‘ది వేకెంట్‌ హౌస్‌’ అనే సినిమాని ఎస్తేర్ తెరకెక్కిస్తుంది.

ఈ సినిమాకు అన్ని తానే అయ్యి నడిపించనుందట. ఒక్క సినిమాతోనే తానేంటో నిరూపించుకునే ప్రయత్నం చేస్తుంది ఎస్తేర్. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు, సంగీతం, స్క్రీన్‌‌ప్లే, మాటలు, కథ, కాస్ట్యూమ్‌, పాటలు, గాయని, నిర్మాత ఇలా చాలా రంగాల్లో తన ప్రతిభ చూపించనుంది.

ఇటీవలే ఈ సినిమా షూటింగ్‌ కూడా పూర్తయిందట. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయని.. అన్ని పనులు పూర్తిచేసి కన్నడ.. కొంకిణి భాషల్లో రిలీజ్‌ చేసేందుకు ఎస్తేర్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇలా అన్ని విభాగాల్లో పనిచేయడం గురించి చెబుతూ.. ‘నేను ఏ దర్శకుడి దగ్గర పని చెయ్యలేదు. కానీ డైరెక్ట్‌ చేయాలని మాత్రం కోరికగా ఉండేది.

కొంత మంది ఇచ్చిన ప్రోత్సాహమే ఇలా కొత్త జర్నీని మొదలు పెట్టేలా చేశాయి. డైరెక్షన్‌ పెద్ద కష్టమేమి కాదు. మనసు పెట్టి పనిచేస్తే ఏదైనా సులువే. చిన్ననాటి నుంచి సంగీతమంటే ఉన్న ఇష్టం.. స్కూల్‌, కాలేజీల్లో పోటీల్లో పాల్గొని ప్రైజ్‌‌లు గెలిచేలా చేసింది.

ఇప్పుడు అది కూడా నా జర్నీలో భాగం కావడం నిజంగా సంతోషాన్ని నింపింది. ఇక ‘ది వేకెంట్‌ హౌస్‌’ చాలా విభిన్నమైన ప్రేమ కథా చిత్రం. మంగుళూరు దగ్గర ఒక ఫార్మ్‌ హౌస్‌‌లో షూటింగ్ పూర్తి చేశాం. అక్టోబర్‌‌లో రిలీజ్‌‌కి సిద్ధం చేస్తున్నాం..’’ అని తెలిపింది ఎస్తేర్. మరి ఆమె ఈ ప్రయత్నమైనా సక్సెస్ అవుతుందో.. లేదో చూద్దాం.

Exit mobile version