Site icon vidhaatha

Aditya-L1 | సదా రవిని గాంచు చోటు.. ఇస్రో గాంచెన్

Aditya-L1 |

అదే లగ్రాంజ్ పాయింట్ L1.. ఇస్రో ‘సూర్యనమస్కారం

నిన్న ‘చంద్రముఖి’ (చంద్రయాన్-3) సక్సెస్. ఇక రేపటి సరికొత్త మిషన్.. ‘సూర్యకళ’. సూర్యచంద్రులతో ‘ఇస్రో’ సయ్యాట. సెప్టెంబర్‌ 2న ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్‌-1ను శ్రీహరి కోట నుంచి ప్రయోగించనున్నట్లు తెలిపింది. సూర్య నమస్కారానికి భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ సిధ్ధం. సూర్యుడి గురించి మనకు తెలియని రహస్యాలు బోలెడు వెలుగు చూస్తాయ్. దినకరుడి చెంతకు ఇదే మన తొలి మిషన్. భానుడి కార్యకలాపాలు, భూమి సహా రోదసి వాతావరణం మీద భాస్కరుడి ప్రభావంపై అధ్యయనం జరపనున్న ‘ఆదిత్య-ఎల్1’ మిషన్.

పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ-XL/సి57)తో నిర్వహించే ఈ ప్రయోగ వ్యయం రూ.368 కోట్లు. బెంగళూరులోని యు.ఆర్.రావు శాటిలైట్ సెంటర్లో తయారైన ‘ఆదిత్య-L1’ ఉపగ్రహంలో 7 (పేలోడ్స్) శాస్త్రీయ పరికరాలు అమర్చారు. 4 పేలోడ్స్ దివాకరుడిని నేరుగా వీక్షిస్తాయి. మిగతా 3 పరికరాలు సౌర కణాలు, విద్యుదయస్కాంత క్షేత్ర పరిశీలనలో నిమగ్నమవుతాయి. సూర్యుడి పొరలైన ఫొటోస్ఫియర్, క్రోమోస్ఫియర్, కరోనాలను పేలోడ్స్ పరిశీలిస్తాయి. ఆధునిక సౌర భౌతికశాస్త్రంలో సవాలుగా నిలిచిన కొన్ని ప్రశ్నలకు ఈ స్టడీ సమాధానాలను అన్వేషిస్తుంది.

Exit mobile version