Aditya-L1 | మరికొద్ది గంటల్లో నింగిలోకి దూసుకెళ్లనున్న ఆదిత్య ఎల్‌-1.. రంగం సిద్ధం చేసిన ఇస్రో

Aditya-L1 | చంద్రయాన్‌-3 విజయవంతంతో జోరుమీదున్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ మరికొద్ది గంటల్లో నింగిలోకి దూసుకెళ్లనున్నది. ఇందు కోసం శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ స్టేషన్‌లో శుక్రవారం కౌంట్‌డౌన్‌ ప్రారంభించింది. 23 గంటలకు పైగా ఈ ప్రక్రియ కొనసాగనున్నది. ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్‌-1 శాటిలైట్‌ను పీఎస్‌ఎల్‌వీ సీ-57 నింగిలోకి మోసుకెళ్లనున్నది. అయితే, ఇస్రో సూర్యుడిపై చేపడుతున్న తొలి మిషన్‌ […]

  • Publish Date - September 2, 2023 / 02:33 AM IST

Aditya-L1 |

చంద్రయాన్‌-3 విజయవంతంతో జోరుమీదున్న భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి రంగం సిద్ధం చేసింది. ఆదిత్య ఎల్‌-1 మిషన్‌ మరికొద్ది గంటల్లో నింగిలోకి దూసుకెళ్లనున్నది. ఇందు కోసం శ్రీహరికోటలో ఉన్న సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ స్టేషన్‌లో శుక్రవారం కౌంట్‌డౌన్‌ ప్రారంభించింది.

23 గంటలకు పైగా ఈ ప్రక్రియ కొనసాగనున్నది. ఉదయం 11.50 గంటలకు ఆదిత్య ఎల్‌-1 శాటిలైట్‌ను పీఎస్‌ఎల్‌వీ సీ-57 నింగిలోకి మోసుకెళ్లనున్నది. అయితే, ఇస్రో సూర్యుడిపై చేపడుతున్న తొలి మిషన్‌ ఇదే. 1500 కిలోల బరువున్న శాటిలైట్‌ను భూమికి 15లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్న లాగ్రాంజ్‌ పాయింట్ 1 (L1) చుట్టూ ఉన్న కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు.

దీంతో గ్రహణాలతో సంబంధం లేకుండా సూర్యుడిపై నిరంతరం ఇస్రో అధ్యయనం చేయనున్నది. మిషన్‌ ఆదిత్య ఎల్‌-1లో ఏడు పేలోడ్లను మోసుకెళ్లనుంది. విజిబుల్‌ ఎమిషన్‌ లైన్‌ కొరోనాగ్రాఫ్‌ (VELC)తో పాటు సోలార్‌ అల్ట్రావైలెట్‌ ఇమేజింగ్‌ టెలిస్కోప్‌, ఆదిత్య సోలార్‌ విండ్‌ పార్టికల్‌ ఎక్స్‌పెరిమెంట్‌, ప్లాస్మా అనలైజర్‌ ప్యాకేజ్‌ ఫర్‌ ఆదిత్య, సోలార్‌లో ఎనర్జీ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, హైఎనర్జీ ఎల్‌-1 ఆర్బిటింగ్‌ ఎక్స్‌రే స్పెక్ట్రోమీటర్‌, మాగ్నెటోమీటర్‌ పేలోడ్‌ను అమర్చారు.

సూర్యుడి నుంచి వెలువడే శక్తిమంతమైన కాంతిపై ఈ పేలోడ్స్‌తో అధ్యయనం చేయనున్నారు. పేలోడ్స్‌ ఎలక్ట్రోమాగ్నెటిక్‌, మాగ్నెటిక్‌ ఫీల్డ్‌ డిటెక్టర్ల సాయంతో సూర్యుడిలోని పొరలైన ఫొటోస్పియర్‌, క్రోమో స్పియర్‌, వెలుపల ఉండే కరోనాపై అధ్యయనం చేయనున్నారు. నేడు నింగిలోకి దూసుకెళ్లనున్న శాటిలైట్‌ను కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు సుమారు 125 రోజులు పట్టనున్నది.

Latest News