Air India | తిరువనంతపురం: 154 మంది ప్రయాణికులు.. ఎయిర్ ఇండియా విమానం ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్‌

Air India | అత్యవసరంగా దిగిన 154 మంది ప్ర‌యాణికుల విమానం విధాత‌: ఎయిర్ ఇండియా విమానానికి సోమ‌వారం తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. తిరుచ్చి-షార్జా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 613 విమానాన్ని సోమవారం తిరువనంతపురం విమానాశ్రయంలో ముందు జాగ్రత్తగా ల్యాండింగ్ చేశారు. విమానంలో 154 మంది ప్రయాణికులు ఉన్నారు. తిరువనంతపురంలో మధ్యాహ్నం సమయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. తిరుచిరాప‌ల్లి నుంచి ఉదయం 10:45 గంటలకు విమానం బయలుదేరిన […]

  • Publish Date - July 31, 2023 / 09:05 AM IST

Air India |

అత్యవసరంగా దిగిన 154 మంది ప్ర‌యాణికుల విమానం

విధాత‌: ఎయిర్ ఇండియా విమానానికి సోమ‌వారం తృటిలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. తిరుచ్చి-షార్జా ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 613 విమానాన్ని సోమవారం తిరువనంతపురం విమానాశ్రయంలో ముందు జాగ్రత్తగా ల్యాండింగ్ చేశారు. విమానంలో 154 మంది ప్రయాణికులు ఉన్నారు.

తిరువనంతపురంలో మధ్యాహ్నం సమయంలో విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి తెలిపారు. తిరుచిరాప‌ల్లి నుంచి ఉదయం 10:45 గంటలకు విమానం బయలుదేరిన తర్వాత ఎమ‌ర్జెన్సీ కార‌ణంగా తిరువనంతపురం విమానాశ్రయంలో విమానం ల్యాండ్ అయిన‌ట్టు ఎయిర్‌పోర్ట్ అథారిటీ ప్రకటించింది.

”సోమ‌వారం త‌మిళ‌నాడులోని తిరుచిరాపల్లి – షార్జా మధ్య నడిచే విమానం (IX613) కేర‌ళ‌లోని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ముందుజాగ్రత్తగా ల్యాండింగ్ అయింది. టేకాఫ్ తర్వాత సాంకేతిక లోపం కారణంగా పైలెట్ ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ కాదు. విమాన ప్ర‌యాణికుల‌కు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. మా బృందం వారి ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్న‌ది” అని ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రతినిధి తెలిపారు.

Latest News