Aishwarya Rai – Abhishek Bachchan | విడాకులు తీసుకోనున్న మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌-అభిషేక్‌ బచ్చన్‌..!

<p>Aishwarya Rai and Abhishek Bachchan | సెలబ్రెటీల పెళ్లిళ్లు.. విడాకులు సర్వ సాధారణమే. ముఖ్యంగా సినీతారలకు ఇది బాగా వర్తిస్తుంది. ఇప్పటికే ఎన్నో జంటలు పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయాయి. తాజాగా బాలీవుడ్‌లో మరో జంట సైతం విడాకులు తీసుకోబోతున్నారనే వార్త చెక్కర్లు కొడుతున్నది. ఈ జంట మరెవరో కాదు మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌. ఇద్దరు త్వరలో వీడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది. అయితే, ఐశ్వర్యరాయ్, అభిష్ మధ్య […]</p>

Aishwarya Rai and Abhishek Bachchan |

సెలబ్రెటీల పెళ్లిళ్లు.. విడాకులు సర్వ సాధారణమే. ముఖ్యంగా సినీతారలకు ఇది బాగా వర్తిస్తుంది. ఇప్పటికే ఎన్నో జంటలు పెళ్లి చేసుకొని.. ఆ తర్వాత మనస్పర్థలు రావడంతో విడిపోయాయి. తాజాగా బాలీవుడ్‌లో మరో జంట సైతం విడాకులు తీసుకోబోతున్నారనే వార్త చెక్కర్లు కొడుతున్నది. ఈ జంట మరెవరో కాదు మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్‌, అభిషేక్‌ బచ్చన్‌. ఇద్దరు త్వరలో వీడాకులు తీసుకోబోతున్నారని ప్రచారం జరుగుతుంది.

అయితే, ఐశ్వర్యరాయ్, అభిష్ మధ్య మనస్పర్థలు వచ్చాయని, దాంతో విడిపోయేందుకే సిద్ధమయ్యారని రూమర్లు వస్తున్నాయి. వీరిద్దరూ జంటగా బయట కనిపించి చాలా అవుతుంది. ఇటీవల నీతా అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ వేడుకకు ఐశ్యర్యరాయ్‌ తన కూతురు ఆరాధ్యతో కలిసి వచ్చింది. అమితాబ్ మనవరాలు, అభిషేక్- ఐశ్వర్య కుమార్తె గారాల తనయ ఆరాధ్య ఈ ఈవెంట్‌లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది.

అయితే, వారిద్దరూ వచ్చారని సంబరపడే అభిమానుల కంటే అభిషేక్ ఎందుకు రాలేదు? అంటూ పలువురు అభిమానులు ఆరాలు తీస్తున్నారు. అభిషేక్ ఎందుకు రాలేదు..? నిజంగానే వీరు విడిపోతున్నారా..? త్వరలో విడాకులకు రెడీ అయ్యారా..? అందుకే జంటగా ఫంక్షన్లకు హాజరు కావడం లేదా? అంటూ చర్చించుకుంటున్నారు.

అయితే, ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని పలువురు కొట్టిపడేస్తున్నారు. మరి ఇందులో వాస్తవమెంతో వారిద్దరికే తెలియాలి. ఈ వార్తలను సైతం ఖండించకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. రూమర్లపై ఏదైనా ప్రకటన చేస్తారా? లేదా చూడాలి మరి.

ఇదిలా ఉండగా.. ఐశ్వర్యరాయ్‌ – అభిషేక్‌ బచ్చన్‌. ఏప్రిల్‌ 20, 2007లో పెళ్లి చేసుకున్నారు. అభిషేక్‌ బచ్చన్‌ కన్నా ఐశ్వర్యరాయ్‌ మూడేళ్లు పెద్ద. పెళ్లి సమయంలో ఐశ్యర్యరాయ్‌ వయసు 34 కాగా.. అభిషేక్‌ వయసు 31. వీరిద్దరి 11 సంవత్సరాలు కూతురు ఆరాధ్య ఉన్నది.

Latest News