Site icon vidhaatha

AP సీఎం చంద్రబాబు CPROగా ఆలూరి రమేష్

విధాత‌, విజయవాడ: ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu)తన వద్ద 4 ఏళ్లుగా పీఆర్వోగా పనిచేస్తున్న ఆలూరి రమేష్ (Aluri Ramesh) అనే జర్నలిస్టును తనకు చీఫ్ పీఆర్వోగా (C PRO) ఖరారు చేశారు. రమేష్ ప్రస్తుతం చంద్రబాబు వద్ద మీడియా వ్యవహారాలు చూస్తున్నారు. అయితే ఇకపై సీపీఆర్వో ఉత్తర్వుల ద్వారా అధికారంగా పనిచేయనున్నారు.

2002 ఆంధ్రజ్యోతి జర్నలిజం స్కూల్ తొలి బ్యాచ్ ద్వారా రమేష్ మీడియాలోకి వచ్చారు. ఆంధ్రజ్యోతి రీ ఓపెన్ సమయంలో విజయవాడ ఆఫీస్ లో ట్రైనీ సబ్ ఎడిటర్ గా జాయిన్ అయ్యారు. తరువాత గుంటూరు ఆంధ్రజ్యోతిలో, హైదరాబాద్ లో రిపోర్టర్ గా పనిచేశారు. రాష్ట్ర విభజన తరువాత 2015లో విజయవాడ వచ్చిన ఆయన, నాలుగేళ్ల క్రితం చంద్రబాబు వద్ద పిఆర్వోగా చేరారు. చంద్రబాబు సిఎం అయిన తరువాత తొలి రోజు నుంచి ముఖ్యమంత్రి మీడియా వ్యవహారాలను చూసిన రమేష్ ను ప్రభుత్వంలోకి తీసుకునేందుకు చంద్రబాబు నిర్ణయించారు.

Exit mobile version