Amazon | మరో 9వేలమంది ఉద్యోగులపై అమెజాన్‌ వేటు..! కష్టకాలంలో ఖర్చుల ఆదాకే ఈ చర్యలన్న సీఈవో

Amazon | ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాల నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలకు చెందిన ఉద్యోగులు రోడ్డున పడ్డారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, మెటా, అమెజాన్, డిస్నీ తదితర దిగ్గజ కంపెనీలు ఆరు నెలల్లోనే వేలాది మందిని ఉద్యోగులను తొలగించాయి. ఇదిలా ఉండగా.. ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం మరోసారి ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ విడుతలో దాదాపు 9వేల మందిని కంపెనీ సీఈవో ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ఈ మేరకు బాధిత ఉద్యోగులకు […]

  • Publish Date - March 21, 2023 / 02:38 AM IST

Amazon | ప్రపంచవ్యాప్తంగా మాంద్యం భయాల నేపథ్యంలో కంపెనీలు ఉద్యోగులకు లేఆఫ్స్‌ ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలకు చెందిన ఉద్యోగులు రోడ్డున పడ్డారు. గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, మెటా, అమెజాన్, డిస్నీ తదితర దిగ్గజ కంపెనీలు ఆరు నెలల్లోనే వేలాది మందిని ఉద్యోగులను తొలగించాయి. ఇదిలా ఉండగా.. ప్రముఖ ఈ-కామర్స్‌ దిగ్గజం మరోసారి ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించింది. ఈ విడుతలో దాదాపు 9వేల మందిని కంపెనీ సీఈవో ఆండీ జాస్సీ పేర్కొన్నారు. ఈ మేరకు బాధిత ఉద్యోగులకు సందేశాన్ని పంపారు. అమెజాన్‌ కష్టకాలంలో ఉందని, ఖర్చులను ఆదా చేసేందుకు ఈ చర్య తీసుకుంటుందని తెలిపారు. రెండో దశలో అమెజాన్ వెబ్ సర్వీసెస్, అడ్వర్టైజింగ్, పీపుల్ ఎక్స్‌పీరియన్స్ టెక్నాలజీ విభాగాల్లో తొలగింపులుంటాయని చెప్పారు. ఇదిలా ఉండగా కంపెనీ ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి కాదు. ఇంతకు ముందు ఈ ఏడాది జనవరిలో దాదాపు 18వేల మంది ఉద్యోగులను బయటకు పంపింది.

అమెజాన్‌ ఉద్యోగులను ఎందుకు తొలగిస్తున్నది..?

గత కొద్ది సంవత్సరాల్లో అమెజాన్‌ భారీ సంఖ్యలో ఉద్యోగులను భర్తీ చేసుకున్నది. ప్రస్తుత ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో ఖర్చులను ఆదా చేసేందుకు చర్యలకు ఉపక్రమించింది. ఉన్న వనరులను జాగ్రత్తగా ఉపయోగించుకునేందుకు ఉద్యోగులను తొలగించాల్సి ఉంటుందని కంపెనీ సీఈవో వివరించారు. ఈ చర్య దీర్ఘకాలంలో కంపెనీకి సహాయపడుతుందని, ఆదా అయ్యే డబ్బును మంచి పనులకు కోసం ఉపయోగించనున్నట్లు చెప్పారు. అనిశ్చిత ఆర్థిక వ్యవస్థ, సమీప భవిష్యత్‌లో మాంద్యం కారణాలతో ఖర్చులు, హెడ్‌కౌంట్‌లో మరింత క్రమబద్ధీకరించాలని నిర్ణయించామన్నారు. రెండోవిడుతలో క్లౌడ్, అడ్వర్టైజింగ్ ఇతర విభాగాల్లో ఉన్న ఉద్యోగులు ప్రభావితం కానున్నారని ఆండీ జాస్సీ వివరించారు.

Latest News