Amith Sha | రోజుకు 17 గంట‌లు శ్ర‌మించే ప్ర‌ధానీ మోదీ: అమిత్‌షా

Amith Sha రాజ‌కీయంగా భ్ర‌మ‌లు క‌ల్పించ‌డానికే ఈ అవిశ్వాస ఆట‌ ప్ర‌జ‌ల‌కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న నాయ‌కుడు మోదీ బీజేపీపై ప్ర‌జ‌ల్లో పూర్తి విశ్వాసం ఉన్న‌ది విధాత: బీజేపీ ప్ర‌భుత్వానికి మెజారిటీ ఉన్న‌ప్ప‌టికీ రాజ‌కీయంగా ప్ర‌జ‌ల్లో భ్ర‌మ క‌ల్పించ‌డం కోస‌మే ప్ర‌తిప‌క్షాలు అవిశ్వాస తీర్మానం తెర‌మీద‌కు తీసుకొచ్చాయ‌ని బుధ‌వారం పార్ల‌మెంటు స‌మావేశాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈ మేర‌క ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌ధానీ న‌రేంద్ర మోదీ దేశంలోని పేద ప్ర‌జ‌ల‌కు ఒక […]

  • Publish Date - August 9, 2023 / 12:28 AM IST

Amith Sha

  • రాజ‌కీయంగా భ్ర‌మ‌లు క‌ల్పించ‌డానికే ఈ అవిశ్వాస ఆట‌
  • ప్ర‌జ‌ల‌కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న నాయ‌కుడు మోదీ
  • బీజేపీపై ప్ర‌జ‌ల్లో పూర్తి విశ్వాసం ఉన్న‌ది

విధాత: బీజేపీ ప్ర‌భుత్వానికి మెజారిటీ ఉన్న‌ప్ప‌టికీ రాజ‌కీయంగా ప్ర‌జ‌ల్లో భ్ర‌మ క‌ల్పించ‌డం కోస‌మే ప్ర‌తిప‌క్షాలు అవిశ్వాస తీర్మానం తెర‌మీద‌కు తీసుకొచ్చాయ‌ని బుధ‌వారం పార్ల‌మెంటు స‌మావేశాల్లో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అన్నారు. ఈ మేర‌క ఆయ‌న మాట్లాడుతూ.. ప్ర‌ధానీ న‌రేంద్ర మోదీ దేశంలోని పేద ప్ర‌జ‌ల‌కు ఒక న‌మ్మ‌కాన్ని తీసుకొచ్చార‌న్నారు. బీజేపీ పాల‌న‌పై ప్ర‌ధానీ మోదీపై దేశ ప్ర‌జ‌ల్లో పూర్తి విశ్వాసం ఉన్న‌ద‌ని, ఈ అవిశ్వాస‌మ‌నేది రాజ‌కీయంగా ప్ర‌జ‌ల్లో అల‌జ‌డి రేప‌డానికే ప్ర‌తిప‌క్షాలు ఆడుతున్న ఆట‌ల‌ని అన్నారు.

స్వాతంత్రం వ‌చ్చిన త‌రువాత దేశంలో అత్యంత ఎక్కువ‌ ప్ర‌జ‌లు మెచ్చుకున్న ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ మాత్ర‌మేన‌ని అమిత్ షా పేర్కొన్నారు. మోదీ అత్యంత ప్ర‌జాదార‌ణ పొందిన నాయ‌కుడ‌ని, దేశ ప్ర‌జ‌ల సంక్షేమం కోసం ఒక్క సెల‌వు కూడా తీసుకోకుండా నిర్విరామంగా రోజుకు 17 గంట‌లు శ్ర‌మించే నేతని అందుకు ప్ర‌జ‌లు మోదీనీ ప్ర‌జ‌లు ఇంత‌గా అభిమానిస్తున్నార‌ని కేంద్ర మంత్రి తెలిపారు. అవిశ్వాస తీర్మానంతో ప్ర‌తిప‌క్షాల అస‌లు రంగు ఎంటో దేశంలోని ప్ర‌జ‌ల‌కు తెలిసింద‌న్నారు.

మంగ‌ళ‌వారం కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని ప్ర‌వేశ పెట్టిన త‌రువాత ఎంపీ గౌర‌వ్ గోగ‌య్ లోక్ స‌భ‌లో చ‌ర్చ మొద‌లు పెట్టారు. మ‌ణిపూర్‌లో జ‌రుగుతున్న అల్ల‌క‌ల్లోలంపై ప్ర‌ధానీ మౌన వ్ర‌తం వ‌హించ‌డం మూలంగానే కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఈ అవిశ్వాస తీర్మానం ప్ర‌వేశ పెడుతున్న‌ట్లు తెలిపింది. ప్ర‌ధానీ న‌రేంద్ర మోదీ అవిశ్వాసం ఎదుర్కొవ‌డం ఇది రెండ‌వ‌సారి కాగా తాను రెండ‌వ సారి ప్ర‌ధాని అయ్యాక ఇది మొద‌టిది.

గ‌త మూడు నెల‌లుగా మ‌ణిపూర్ మంట‌ల్లో ర‌గిలిపోతోంది. మేతీ, కూకీ తెగ‌ల‌కు సంభందించి గ‌తంలో మ‌ణిపూర్ హైకోర్టు ఒక దాన్ని ట్రైబ‌ల్ క‌మ్మ్యూనిటీలో క‌లపాలంటూ తీర్పు ఇవ్వ‌డంతో వారి మ‌ధ్య తీవ్ర గొడ‌వ‌లు జ‌రుగుతూ హింసాత్మ‌క చ‌ర్య‌ల‌కు పాలుప‌డుతున్నారు.

Latest News