Hyderabad | స‌న‌త్ న‌గ‌ర్‌లో అమ్మోనియా గ్యాస్ లీక్.. 15 మందికి అస్వ‌స్థ‌త‌

Hyderabad | హైద‌రాబాద్ స‌న‌త్ న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఫ‌తేన‌గ‌ర్‌లో గురువారం సాయంత్రం అమ్మోనియా గ్యాస్ లీకైంది. దీంతో 15 మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వీరిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం. వివ‌రాల్లోకి వెళ్తే.. ఫ‌తేన‌గ‌ర్‌లోని పైప్‌లైన్ రోడ్డు చివ‌ర‌న ఉన్న చెత్త‌కుప్ప‌ల్లో గ్యాస్ క‌టింగ్‌కు ఉప‌యోగించే రెండో అమ్మోనియా గ్యాస్ సిలిండ‌ర్లు చాలా కాలం నుంచి ప‌డి ఉన్నాయి. అయితే ఓ దొంగ సిలిండ‌ర్ల‌ను గ‌మ‌నించి, ఇత్త‌డి వాల్వ్‌లు తీసుకునేందుకు య‌త్నించాడు. సిలిండ‌ర్ల‌ను […]

  • Publish Date - June 30, 2023 / 12:10 AM IST

Hyderabad | హైద‌రాబాద్ స‌న‌త్ న‌గ‌ర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలోని ఫ‌తేన‌గ‌ర్‌లో గురువారం సాయంత్రం అమ్మోనియా గ్యాస్ లీకైంది. దీంతో 15 మంది అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. వీరిలో ప‌లువురి ప‌రిస్థితి విష‌మంగా ఉన్న‌ట్లు స‌మాచారం.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఫ‌తేన‌గ‌ర్‌లోని పైప్‌లైన్ రోడ్డు చివ‌ర‌న ఉన్న చెత్త‌కుప్ప‌ల్లో గ్యాస్ క‌టింగ్‌కు ఉప‌యోగించే రెండో అమ్మోనియా గ్యాస్ సిలిండ‌ర్లు చాలా కాలం నుంచి ప‌డి ఉన్నాయి. అయితే ఓ దొంగ సిలిండ‌ర్ల‌ను గ‌మ‌నించి, ఇత్త‌డి వాల్వ్‌లు తీసుకునేందుకు య‌త్నించాడు. సిలిండ‌ర్ల‌ను రాడ్డుతో కొట్టి తొల‌గించ‌బోయాడు. దీంతో ఒక్క‌సారిగా సిలిండ‌ర్ నుంచి పెద్ద ఎత్తున అమ్మోనియా గ్యాస్ లీక్ కావ‌డంతో.. దొంగ అటు నుంచి పారిపోయాడు.

ఇక స‌మీపంలో ఉన్న ఓ కంపెనీలో ప‌ని చేస్తున్న 10 మంది బీహార్ కార్మికులు అమ్మోనియా గ్యాస్‌ను పీల్చారు. 10 నుంచి 12 మీట‌ర్ల ఎత్తులో గ్యాస్ పొగ‌లా వ్యాపించింది. దీంతో కార్మికుల‌కు ఊపిరాడ‌క‌, వాంతుల‌తో అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. స‌మీప బ‌స్తీవాసుల్లో ఐదుగురు కండ్ల మంట‌లు, వాంతుల‌తో ఇబ్బంది ప‌డ్డారు.

బాధితుల‌ను బాలాన‌గ‌ర్‌లోని బీబీఆర్ ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందించారు. గ్యాస్ లీకైన ప్రాంతంలో పెద్ద విద్యుత్ ట్రాన్స్‌ఫార్మ‌ర్ కూడా ఉంద‌ని, అదృష్ట‌వ‌శాత్తూ అగ్గి రాజుకోలేద‌ని స్థానికులు పేర్కొన్నారు. దొంగ చేసిన ప‌నికి గ్యాస్ లీక్ కావ‌డంతో.. స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

Latest News