Site icon vidhaatha

Anantnag Encounter | అనంత్‌నాగ్‌లో ముగిసిన ఎన్‌కౌంటర్‌.. ఎల్‌టీఈ ఉగ్రవాది ఉజైర్‌ఖాన్‌ హతం..

Anantnag Encounter |

దక్షిణ కశ్మీర్‌ అనంత్‌నాగ్‌లో కొనసాగుతున్న ఎన్‌కౌంటర్‌ మంగళవారం ముగిసింది. మంగళవారం భద్రతా బలగాలు లష్కరే తోయిబా కమాండర్‌ ఉజైర్‌ ఖాన్‌ను మంగళవారం హతమార్చాయి. దీంతో వారం రోజులుగా నిరంతరాయంగా కొనసాగుతూ వచ్చిన ఎన్‌కౌంటర్‌ ముగిసినట్లయ్యింది. హతమైన ఉగ్రవాదుల మృతదేహాలతో ఆధాయులను సైతం భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారని కశ్మీర్‌ ఏడీజీపీ విజయ్‌ కుమార్‌ తెలిపారు.

లష్కర్‌ కమాండర్‌ ఉజైర్‌ ఖాన్‌తో పాటు మరో ఉగ్రవాది మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నామని, దాంతో ఎన్‌కౌంటర్‌ ముగిసిందని తెలిపారు. అనంతర్‌నాగ్‌ కోకెర్‌నాగ్‌లోని దట్టమైన అటవీప్రాంతం, కొండ ప్రాంతంలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు సెర్చ్‌ ఆపరేషన్‌ను ప్రారంభించాయి. అటవీ ప్రాంతంలోన్న గుహవంటి ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కుంటూ దాడికి కాల్పులకు దిగుతూ.. బలగాల నుంచి తప్పించుకున్నారు.

పెద్ద సంఖ్యలో బలగాలను మోహరించడంతో పాటు డ్రోన్లు, హెలికాప్టర్లను మోహరించి.. ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. అయితే, ఎన్‌కౌంటర్‌ ముగిసినా ప్రస్తుతం సంఘటనా స్థలంలో అధికారులు తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఉజైర్‌ ఖాన్‌ నౌగామ్‌ వాసి కాగా.. అతిపై రూ.10లక్షల రివార్డు ఉన్నది. మరో ఉగ్రవాది ఆచూకీ కోసం భదత్రా బలగాలు ప్రయత్నిస్తున్నాయి.

ఈ నెల 12న ఉగ్రవాదుల గురించి సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కోకెర్‌నాగ్‌లో జమ్మూ పోలీసులు, ఆర్మీ, సీఆర్‌పీఎఫ్‌ సంయుక్త బృందం సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహించింది. ఉగ్రవాదుల కాల్పుల్లో కమాండింగ్‌ ఆఫీసర్‌ కర్నల్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌, మేజర్‌ ఆశిష్‌ ధోంచక్‌, జమ్మూ కశ్మీర్‌ పోలీస్‌ డీఎస్పీ హుమాయున్‌ భట్‌ వీరమరణం పొందారు. అలాగే సైనికుడు ప్రదీప్‌ సింగ్‌ సైతం ఉగ్రవాదుల కాల్పుల్లో వీరమరణం పొందాడు.

Exit mobile version