– ఆరోజు ఎంతో దూరంలో లేదు
– గ్రేట్ ఇండియా మా సంకల్పం
– పీవోకేలో ఉన్న ప్రజలు మనవాళ్లే
– రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యలు
Rajnath Singh: విధాత, న్యూఢిల్లీ: పీవోకే ఏదో ఒక రోజు భారత్ లో విలీనం కాక తప్పదని రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. ఆ రోజు మరెంతో దూరంలో లేదని వ్యాఖ్యానించారు. గ్రేట్ ఇండియా ప్రస్తుత కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పీవోకే లో ఉన్న ప్రజలు కూడా భారత దేశ ప్రజలేనంటూ వ్యాఖ్యానించారు.
వారితో భారతీయులకు దృఢ సంబంధాలు ఉన్నాయని వ్యాఖ్యానించారు. ఈ మేరకు గురువారం ఢిల్లీలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాజ్ నాథ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పీవోకే భౌగోలికంగా మనదేశంతో విడిపోయినా ఏదో ఒక రోజు కచ్చితంగా కలవాల్సిందేనని పేర్కొన్నారు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని కొంతమంది తప్పుడు దారిలో పయనిస్తున్నారని.. టెర్రరిస్టు సానుభూతి పరులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
ఆపరేషన్ సిందూర్ అనంతరం మన దేశం ఎంతో స్ట్రాంగ్ గా ఉందన్నదని ప్రపంచదేశాలకు అర్థమైందని రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్నో ఆయుధాలను చూసి పాకిస్థాన్ షాక్ కు గురి అయ్యిందని చెప్పుకొచ్చారు. ఉగ్రస్థావరాలతో పాటు శత్రుదేశానికి చెందిన మిలటరీ స్థావరాలను సైతం ధ్వంసం చేయగలిగామని చెప్పారు.
ఇప్పటికే పాకిస్థాన్ మీద ఓ కన్నేసి ఉంచామని.. ఆ దేశం ఉగ్రవాదులను పెంచి పోషించినా.. చూస్తూ ఉరుకోబోమని హెచ్చరించారు.