Terror links: ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ముగ్గురు అధికారులపై జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వేటు వేశారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే.
దీంతో భద్రతా బలగాలు ఉగ్రవాదులు, వారితో సంబంధాలు ఉన్నవారిపై కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. తాజాగా ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్న ముగ్గురు అధికారులపై వేటు పడింది. వీరంతా లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థలకు గూఢచారులుగా పని చేస్తున్నట్లుగా గుర్తించి వేటు వేశారు. పహల్గామ్ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు ఈ ముగ్గురు అధికారులు సహాయం చేసినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు.
ముగ్గురు ఉద్యోగులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇప్పటివరకు 75 మంది ప్రభుత్వ అధికారులకు ఉగ్రవాదులతో సత్సంబంధాలు ఉన్నట్లు నిఘా సంస్థలు గుర్తించాయి.
ఇప్పటికే పాకిస్థాన్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా లాంటి ఎంతో మందిని నిఘా అధికారులు గుర్తించి అరెస్ట్ చేశారు.