న‌ల్ల‌మ‌ద్ది వృక్షం నుంచి ఉప్పొంగిన జ‌ల‌ధార‌.. వీడియో

వృక్షాల నుంచి నీళ్లు ఉప్పొంగ‌డ‌మ‌నేది వింతే.. ఎందుకంటే చెట్ల నుంచి జ‌ల‌ధార రావ‌డ‌మనేది అస‌హ‌జం. వేప చెట్టు నుంచి వేప క‌ల్లును తీస్తారు.

  • Publish Date - March 30, 2024 / 08:28 AM IST

వృక్షాల నుంచి నీళ్లు ఉప్పొంగ‌డ‌మ‌నేది వింతే.. ఎందుకంటే చెట్ల నుంచి జ‌ల‌ధార రావ‌డ‌మనేది అస‌హ‌జం. వేప చెట్టు నుంచి వేప క‌ల్లును తీస్తారు. తాటి, ఈత చెట్ల నుంచి కూడా క‌ల్లును తీస్తారు. కానీ ఈ న‌ల్ల‌మ‌ద్ది వృక్షం నుంచి జ‌ల‌ధార ఉప్పొంగింది. ఈ అరుదైన దృశ్యం పాపికొండ‌ల్లో ఆవిష్కృత‌మైంది.


పాపికొండ‌ల్లోని కింటుకూరు అట‌వీ ప్రాంతంలోని బేస్ క్యాంపులో ఓ న‌ల్ల‌మ‌ద్ది వృక్షం నుంచి నీళ్లు వ‌స్తున్న‌ట్లు అట‌వీశాఖ అధికారులు గ‌మ‌నించారు. దీంతో అధికారులంద‌రూ ఆ చెట్టు వ‌ద్ద‌కు వెళ్లారు. ఉన్న‌తాధికారుల సమ‌క్షంలో చెట్టుకు రంధ్రం చేయ‌గా, నీళ్లు ఉబికి వ‌చ్చాయి. ఓ రేంజ్‌లో నీళ్లు రావ‌డంతో అధికారులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేశారు. ఈ న‌ల్ల‌మ‌ద్ది వృక్షం నుంచి సుమారు 20 లీట‌ర్ల వ‌ర‌కు నీళ్లు వ‌స్తాయ‌ని అధికారులు వెల్ల‌డించారు.


అయితే న‌ల్ల‌మ‌ద్ది వృక్షం చాలా ప‌వ‌ర్ ఫుల్. ఇంటి గ‌డ‌ప‌కు, త‌లుపుల త‌యారీకి ఈ చెక్క‌ను వినియోగిస్తారు. అంతేకాకుండా కుర్చీలు, మంచాల త‌యారీకి కూడా ఈ చెక్క‌ను విప‌రీతంగా ఉప‌యోగిస్తారు. ఎందుకంటే ఈ క‌ట్టె చాలా గ‌ట్టిగా ఉండి, చాలా లైఫ్ ఉంటుంది. కాబ‌ట్టి న‌ల్ల‌మ‌ద్ది చెక్క‌కు అత్యంత ప్రాధాన్య‌త ఇస్తారు.

Latest News