Site icon vidhaatha

AP | మినీ గూడ్స్ వ్యాన్ బోల్తా.. బయటపడ్డ 7 కోట్ల నగదు

విధాత : ఎన్నికల వేళ తనిఖీల్లో కోట్లాది రూపాయల నోట్ల కట్టలు పట్టుబడుతున్నాయి. పోలింగ్‌కు ముందు ఓటర్లకు డబ్బు, మద్యం పంపిణీ చేసేందుకు పార్టీల అభ్యర్థులు రకరకాల మార్గాల్లో డబ్బు తరలిస్తుండగా వాటిలో కొంత వరకు తనిఖీల్లో చిక్కుతుంది. నగదుతో వెలుతున్న ఓ మినీ గూడ్స్ వ్యాన్ బోల్తా కొట్టడంతో 7 కోట్ల నగదు అనూహ్యంగా పట్టుబడింది.

విజయవాడ నుండి విశాఖపట్నం వెళ్తున్న మినీ గూడ్స్ క్యారియర్ వ్యాన్ తూర్పుగోదావరి దగ్గర ట్రక్కును ఢీకొట్టి బోల్తా పడింది.. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు డబ్బులు చూసి ఎలక్షన్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీకి చెప్పగా వాళ్లు తనిఖీలు చేస్తే 7 కోట్ల నగదు దొరికింది.

మరోవైపు మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల నియోజకవర్గం బాలనగర్‌ మండల కేంద్రం మీదుగా గోవా నుంచి విజయవాడకు అక్రమంగా తరలిస్తున్న 2కోట్ల 7లక్షల 36వేల విలువైన్య మద్యం కాటన్లను పోలీసులు విజయవంతంగా పట్టుకున్నారు. సేంద్రీయ ఎరువుల లోడ్‌లో మధ్యలో మద్యం కాటన్స్‌ పెట్టి తరలిస్తుండగా చాకచక్యంగా పట్టుకోగలిగారు.

Exit mobile version