అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కొమరిపాలెంలోని లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ లో భారీ పేలుడు చోటుచేసుకుంది. పేలుడు ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. బాణాసంచా తయారు చేస్తుండగా ప్రమాదం జరిగినట్లుగా సమాచారం.
మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.