Paris
విధాత: డెలివరీ డ్రైవర్‌గా పని చేస్తున్న 17 ఏళ్ల యువకుడిని పోలీసులు కాల్చిచంపిన ఘటన ప్యారిస్ (Paris) లో చోటు చేసుకుంది. దీనిపై నగరంలో పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఆందోళనకారులు పోలీసులపైకి చిన్న చిన్న బాంబులు, ఫైర్ క్రాకర్స్‌తో దాడికి పాల్పడుతున్నారు. పోలీసులపైకి భౌతిక దాడులకు దిగడం, బ్యారికేడ్లకు, పోలీసు వాహనాలకు నిప్పు పెడుతుండటంతో చాలా చోట్ల టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు.
సాధరాణ చెకింగ్‌లో భాగంగానే మృతుడి కారును పోలీసులు పరిశీలించే క్రమంలో ఈ ఘటన జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ ఘటనతో సంబంధముందని భావిస్తున్న పోలీసు అధికారిని సస్పెండ్ చేశామని.. అలాగే ఘటనా స్థలం నుంచి పారిపోయిన కారులోని మరో ప్రయాణికుడి గురించి గాలిస్తున్నామని వెల్లడించాయి. మృతుడిని 17 ఏళ్ల నయీల్ ఎమ్‌గా గుర్తించామని ప్రాసిక్యూషన్ లాయర్ తెలిపారు.
తమపైకి నయీల్ కారును పోనివ్వడానికి ప్రయత్నించడం వల్లే ప్రాణరక్షణ కోసం కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు తమ నివేదికలో పేర్కొన్నారు. అయితే ఈ వాదనను మృతుడి తరపు లాయర్లు ఖండిస్తున్నారు. పోలీసులు కావాలనే కాల్చారని తమ దగ్గర ఆ వీడియో సైతం ఉందని పేర్కొన్నారు.
మరో వీడియోలో అతడు పోలీసులు ఆపమన్నా ఆపకుండా నయీల్ కారును పోనిచ్చినట్లు అర్థమవుతోంది. అయితే కారును ఆపకపోవడం చట్టవిరుద్ధమే అయినప్పటికీ.. దానికి శిక్ష మరణం కాదని ప్రతిపక్ష పార్టీల నేతలు, మానవ హక్కుల సంఘాల ప్రతినిధులు వ్యాఖ్యానించారు.
ఈ ఘటనపై ఫ్రాన్స్ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్యారిస్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నిరసనకారులు తీవ్ర చర్యలకు ప్రాల్పడుతున్నారు. trafic
వాహనాలను తగులబెట్టారు. దీంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడం, గాల్లోకి కాల్పులు జరుపుతూ నిరసనకారులను చెదరగొడుతున్నారు.