France PM Sebastien Lecornu Resigns | ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను రాజీనామా

రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో, పదవి చేపట్టిన నెల రోజుల్లోపే ఫ్రాన్స్ కొత్త ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను తన పదవికి రాజీనామా చేశారు. మెక్రాన్ రాజీనామాను ఆమోదించారు.

Sebastien Lecornu

విధాత : ఫ్రాన్స్ లో కొనసాగుతున్న రాజకీయ అనిశ్చితి నేపథ్యంలో కొత్త ప్రధాని సెబాస్టియన్‌ లెకోర్నుప్రధాని పదవికి సోమవారం రాజీనామా చేశారు. పదవి బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల లోపే సెబాస్టియన్ రాజీనామా చేయాల్సి వచ్చింది. తాను నియమించిన కేబినెట్ పట్ల విమర్శలు రావడంతో సెబాస్టియన్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మెక్రాన్‌ ప్రధాని సెబాస్టియన్ రాజీనామాను అమోదించారు.

రెండెళ్ల వ్యవధిలోనే ఫ్రాన్స్‌లో సెబాస్టియన్‌తో కలిపి ఐదుగురు ప్రధానులు రాజీనామా చేయడం గమనార్హం. సెబాస్టియన్ అధ్యక్షుడు మెక్రాన్ కు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. బడ్జెట్‌ సమస్యలు, ఉక్రెయిన్‌ యుద్ధం, గాజా పరిస్థితి, అమెరికా అధ్యక్షుడి విధానాలతో ఏర్పడ్డ గందరగోళం కారణంగా ఫ్రాన్స్‌ ఇప్పటికే అనేక సవాళ్లను..రాజకీయ గందరగోళానికి గురి చేశాయని అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు.