విదేశాలలో అంజలి సోకుల విందు.. నిక్కరులో నానా రచ్చ చేసిందిగా..!తెలుగమ్మాయి అంజలి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్‌లో తక్కువ సినిమాలు చేసిన కూడా మంచి సినిమాలే చేసింది. కోలీవుడ్‌లో కూడా ఈ అమ్మడు వైవిధ్యమైన సినిమాలు చేసి స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. అయితే హీరో ‘జై’ తో ప్రేమాయాణం.. ఆ తర్వాత అక్కడ చెలరేగిన వివాదాలతో ఆమె కెరీర్ కాస్త గాడి తప్పింది అని చెప్పాలి.
ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, పలు ఐటెం సాంగ్స్‌లో సందడి చేస్తూ హంగామా చేస్తుంది. అయితే సినీ వర్గాల్లో వస్తున్న వార్తల ప్రకారం, అంజలి తల్లిదండ్రులు ఆమెకు ఓ మంచి కుర్రాడిని చూసి, త్వరలోనే వివాహం చేయబోతున్నారని టాక్. కూతురి కోసం చెన్నైలో ఉంటున్న ఓ బిజినెస్‌మెన్ ని చూశారని, త్వరలో అతడితో వివాహం జరిపించనున్నారని సమాచారం.
ప్రస్తుతం అంజలి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న RC15 మూవీలో కథానాయికగా నటిస్తుంది. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా గేమ్ చేంజర్ రూపొందుతుంది. అయితే అంజలి ప్రస్తుతం విదేశాలలో చక్కర్లు కొడుతుంది. అక్కడ పొట్టి దుస్తులలో నానా హంగామా చేస్తూ ఇచ్చి న పోజులు కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి.
ప్రస్తుతం అంజలి పిక్స్ నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అంజలిని ఇలా చూసి ప్రతి ఒక్కరు మైమరచిపోతున్నారు. ఏమా అందం అంటూ కొందరు ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు అంజలి పిక్స్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. అంజలి తమిళ సినిమా షాపింగ్ మాల్ ద్వారా పేరు సంపాదించిన విషయం తెలిసిందే.
ఆ సినిమా తర్వాత తమిళ్‌తో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి అగ్రహీరోల సరసన నటించి అలరించింది. ఈ అమ్మడికి అందం, టాలెంట్ ఉన్నా కూడా ఎందుకు అంత క్లిక్ కాలేకపోయింది. సోషల్ మీడియాలో అప్పుడప్పుడు తన క్యూట్ పిక్స్ షేర్ చేస్తూ అలరిస్తుంటుంది. ఈ అమ్మడు షేర్ చేసే పిక్స్ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నాయి. అంజలి ఆ మధ్య పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రంలో కూడా ఓ పాత్రతో అలరించింది. తాజాగా గీతాంజలి మళ్లీ వచ్చింది చిత్రంలో నటిస్తున్నది.