Site icon vidhaatha

Taraka Rama Rao: టాలీవుడ్ లోకి మరో ఎన్టీఆర్ ఎంట్రీ !

Taraka Rama Rao: టాలీవుడ్ లోకి మరో ఎన్టీఆర్ ఎంట్రీ ఇచ్చారు. నందమూరి నట వారసుల పరంపరలో నాల్గవతరంగా..దివంగత నందమూరి హరికృష్ణ మనవడు, జానకిరామ్‌ కుమారుడు తారక రామారావు హీరోగా సోమవారం సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఎన్టీఆర్ ఘాట్ లో పూజా కార్యక్రమాలతో ఘనంగా షూటింగ్ మొదలైంది. తారక రామారావు హీరోగా వై.వి.ఎస్‌.చౌదరి దర్శకత్వంలో ఆయన సతీమణి గీత ‘న్యూ టాలెంట్‌ రోర్స్‌’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీణారావు ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా లోకేశ్వరి , పురందేశ్వరి, భువనేశ్వరిలతో పాటు ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులు హాజరయ్యారు. నారా భువనేశ్వరి క్లాప్‌ కొట్టారు. తన ముత్తాత ఎన్టీఆర్ లానే తారకరామారావు కు కూడా కీర్తి ప్రతిష్టలు లభించాలని, ప్రతిభతో గొప్ప స్దాయికి ఎదగాలని ఆకాంక్షించారు. నటీనటులను అభినందించారు. సీఎం చంద్రబాబు ఎక్స్ లో విషెస్ చెప్పారు.
ఈ సందర్భంగా న్యూ హీరో  తారకరామరావు మాట్లాడుతూ మా ముత్తాత సీనియర్ ఎన్టీఆర్ ఆశీస్సులు, మా తాత హరికృష్ణ ఆశీస్సులు, మా నాన్న జానకి రామ్ ఆశీస్సులు నాతో ఎప్పుడు ఉంటాయి అని భావిస్తున్నానన్నారు. నన్ను హీరోగా అనౌన్స్ చేసిన రోజు నుంచి నాకు ఎంతో మద్దతునిస్తున్న నందమూరి అభిమానులకు చాల థాంక్స్ అని తెలిపారు. ద‌ర్శ‌కుడు వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ ఈ సినిమా తెలుగు సంస్కృతి ,హైందవ సాంప్రదాయం నేపథ్యంలో ఉంటుందని, కీరవాణి ,సాయిమాధవ్ బుర్రా వంటి గొప్ప టెక్నిషియన్స్ వర్క్ చేస్తున్నారని అన్నారు. నందమూరి కుటుంబసభ్యులంతా ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించి మా సినిమా ప్రారంబోత్సవానికి వచ్చి ఆశీర్వదించడం సంతోషంగా ఉందన్నారు.
Exit mobile version