Site icon vidhaatha

Suryapet: గోడ కూలిన ఘటనలో మరో విద్యార్థి మృతి

విధాత: సూర్యాపేట(Surypeta) జిల్లా చివ్వెం(Chivvemla)ల మండల కేంద్రంలోని గురుకుల(Gurukul) పాఠశాల(School)లలో నీటి సంపు గోడ కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడిన శాలిగౌరారం మండలం లింగోటం గ్రామానికి చెందిన విద్యార్థి కొప్పుల యశ్వంత్ హైదరాబాదు నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు.

మోతే మండలం అప్పన్నగూడేనికి చెందిన పవన్(10) ఘటన రోజు.. గత గురువారం మృతి చెందగా, తీవ్రంగా గాయపడిన శాలిగౌరారం మండలానికి చెందిన యశ్వంత్, మద్దిరాల మండలం చందుపట్ల గ్రామానికి చెందిన సుశాంత్ ను హైదరాబాద్ నిమ్స్ కి తరలించారు. యశ్వంత్ మంగళవారం మృతి చెందాడు. దీంతో ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కాగా మృతి చెందిన యశ్వంత్ కు జిల్లా కలెక్టర్ తక్షణ సహాయం కింద రెండు లక్షలు సహాయాన్ని మంజూరు చేశారు. అలాగే కుటుంబంలో ఒకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇవ్వనున్నట్లుగా ప్రకటించారు.

Exit mobile version