- పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకం
విధాత: చంద్రబాబు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్న నేపథ్యంలో కొద్దీ రోజులుగా టీడీపీ పార్టీ కార్యక్రమాలు చల్లబడ్డాయి. అటు లోకేష్ చేపడుతున్న యువగళం పాదయాత్ర సైతం నిలిచిపోయింది. ప్రస్తుతం అయన జాతీయ పార్టీల నాయకుల మద్దతుకూడగట్టేందుకు ఢిల్లీలో ఉంటున్నారు. ఆయన సొంత రాష్ట్రానికి ఎప్పుడు వస్తారన్నది ఇంకా స్పష్టత రాలేదు.
ఇక బాబు అరెస్ట్ తో షాక్ కు గురైన టిడిపి శ్రేణులు ఎక్కడికక్కడ సైలెంట్ అయ్యాయి. పోనీ ఈ విషయం మీద ధర్నాలు చేస్తే పోలీసులు కేసులుపెట్టి లోపల వేస్తున్నారు. మళ్లీ ఆ కేసులు.. కోర్టుల చుట్టూ తిరగడానికి భయపడిన టిడిపి నాయకులు ఆందోనళలు చేసేందుకు ముందుకు రావడం లేదు.
ఇలా ఇంకొన్నాళ్ళు వదిలేస్తే పార్టీ పూర్తిగా నిస్తేజంలోకి వెళ్ళిపోతుందని ఇది మున్ముందు పార్టీకి మరింత నష్టం చేకూరుస్తుందని ఆందోళన చెందిన పార్టీ అధినేత చంద్రబాబు ఈ గడ్డుకాలంలో పార్టీని నడిపేందుకు 14 మంది నాయకులతో కూడిన పొలిటికల్ యాక్షన్ కమిటీని వేశారు.
ఈ కమిటీలోని నాయకులంతా పార్టీని ఎప్పటికప్పుడు ముందుకు నడిపిస్తూ క్యాడర్ ను చైతన్యం చేస్తూ ముందుకు నడిపిస్తారు. మండలాలు, జిల్లాల్లోని పార్టీ అధ్యక్షులకు, ఇంకా గ్రామస్థాయి క్యాడర్ కు ఈ కమిటీ దిశానిర్దేశం చేస్తూ కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంది. మరోవైపు లోకేష్ సైతం త్వరలోనే పాదయాత్రను కొనసాగించే అవకాశాలు ఉన్నాయ్.
అక్టోబర్ ఒకటో తేదీ నుంచి లోకేష్ మళ్ళా పాదయాత్రను కొనసాగిస్తారని అంటున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజోలు వద్ద అయన జాతర ఉండగా చంద్రబాబును అరెస్ట్ చేయడంతో యాత్రకు తాత్కాలికంగా విరామం ప్రకటించిన లోకేష్ ఇప్పుడు మళ్ళీ కొనసాగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిగో ఇదే ఆ టిడిపి పొలిటికల్ యాక్షన్ కమిటీ..
టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకం – పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ నియామకం – సభ్యులుగా యనమల, అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, ఎంఏ షరీఫ్, పయ్యావుల కేశవ్, నందమూరి బాలకృష్ణ, నిమ్మల రామానాయుడు, నక్కా ఆనంద్ బాబు, కాల్వ శ్రీనివాసులు, కొల్లు రవీంద్ర, బీసీ జనార్థన్ రెడ్డి, వంగలపూడి అనిత, బీద రవిచంద్ర, నారా లోకేశ్.