Site icon vidhaatha

Aravind Kejriwal | కాంగ్రెస్‌కు కేజ్రీవాల్ కృత‌జ్ఞ‌త‌లు

Aravind Kejriwal

న్యూఢిల్లీ: ఢిల్లీ ప్రజల పక్షాన నిలిచిన కాంగ్రెస్‌కు ఆమ్ ఆద్మీ పార్టీ అధ్య‌క్షుడు, ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ ధన్య‌వాదాలు తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన‌ ప‌రిపాల‌న సేవ నియంత్ర‌ణ ఆర్డినెన్స్‌కు వ్యతిరేకించాలన్న కేజ్రీవాల్‌ డిమాండ్‌పై కాంగ్రెస్‌ సానుకూలంగా స్పందించడంతో అందుకు ఖర్గేకు ట్విట్టర్‌లో కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలు వేరైనా.. రాజ్యాంగ హ‌క్కుల‌కు భంగం వాటిల్లుతున్న స‌మ‌యంలో అంద‌రం ఏక‌మ‌వ్వాల‌ని, రాజ్యంగాన్ని, ప్ర‌జాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అంద‌రి మీద ఉన్న‌ద‌ని ఖర్గే ట్వీట్‌ చేశారు.

ఖర్గే ప్రకటనపై కేజ్రీవాల్ స్పందిస్తూ, ‘ఢిల్లీ ప్రజలతో నిలబడినందుకు ఖర్గే జీకి ధన్యవాదాలు. ఈ ఆర్డినెన్స్ భారతదేశానికి విరుద్ధం. దేశ వ్యతిరేకం’ అని పేర్కొన్నారు. తన విజ్ఞప్తి మేరకు TMC, RJD, JDU, DMK, BRS, NCP, SP, శివసేన‌, CPI, CPM, JMM తదితర పార్టీలు కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌పై పార్ల‌మెంట్‌లో వ్య‌తిరేకంగా వారి గళం విప్పునున్న‌ట్లు అర‌వింద్ కేజ్రీవాల్‌ తెలిపారు.

Exit mobile version