Site icon vidhaatha

బావ‌మ‌రిది పెళ్లికి వ‌చ్చి.. ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఆర్మీ జ‌వాన్

నిర్మ‌ల్ : బావ‌మ‌రిది పెళ్లికి సెల‌వుపై వ‌చ్చిన ఓ ఆర్మీ జవాను ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలో ఆదివారం చోటు చేసుకుంది.

వివ‌రాల్లోకి వెళ్తే.. నిర్మ‌ల్ ప‌ట్ట‌ణంలోని వెంక‌టాపూర్‌కు చెందిన ర‌మేశ్‌(28) ఆర్మీలో జ‌వాన్‌గా ప‌ని చేస్తున్నారు. ప్ర‌స్తుతం అత‌ను కోల్‌క‌తాలో విధులు నిర్వ‌హిస్తున్నారు. అయితే త‌న బావ‌మ‌రిది పెళ్లి ఉండ‌డంతో సెల‌వుపై స్వ‌స్థ‌లానికి వ‌చ్చారు. బావ‌మ‌రిది పెళ్లి వేడుక‌లు ఆదివారం ముగిశాయి. దీంతో ర‌మేశ్ ఆదివారం ఉద‌య‌మే త‌న సొంతింటికి చేరుకున్నారు. ఏమైందో ఏమో కానీ.. మ‌ధ్యాహ్నం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకున్నారు. త‌న గ‌ది నుంచి బ‌య‌ట‌కు రాక‌పోవ‌డంతో, కుటుంబ స‌భ్యులు లోప‌ల‌కు వెళ్లి చూడ‌గా ఫ్యాన్‌కు వేలాడుతూ క‌నిపించ‌డంతో బోరున విల‌పించారు. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని పంచ‌నామా నిర్వ‌హించారు. ర‌మేశ్ ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు

Exit mobile version