Site icon vidhaatha

Suryapet | జనసమితి నాయకుల అరెస్టు

Suryapet |

విధాత: సూర్యాపేటలో ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆదివారం తెలంగాణ జనసమితి నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. చివ్వెంల, ఆత్మకూరు మండలాల్లో ఉదయమే పోలీసులు పలువురు నాయకులను అదుపులోకి తీసుకుని, పోలీస్ స్టేషన్ కు తరలించారు.

విద్యార్థి జనసమితి జిల్లా అధ్యక్షుడు బొమ్మాగాని వినయ్ గౌడ్, చివ్వెంల మండల పార్టీ అధ్యక్షుడు సుమన్ నాయక్ తో పాటు పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసిన నాయకులు, కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలి ధర్మార్జున్ డిమాండ్ చేశారు.

Exit mobile version