Artificial Intelligence | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI).. అణుబాంబును గ‌ర్తుకుతెస్తోంది: వారెన్ బ‌ఫెట్‌

Artificial Intelligence విధాత‌: అప‌ర కుబేరుడు, పెట్టుబ‌డిదారుడైన వారెన్ బ‌ఫెట్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏఐను ఆటంబాంబుతో పోల్చారు. ఏఐ అభివృద్ధి చెందుతున్న విధానం చూస్తుంటే త‌న‌కు ఆటం బాంబు త‌యారీలో ద‌శ‌లు గుర్తుకు వ‌స్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు. తాజాగా బెర్క్‌షైర్ హాథ్‌వే వార్షిక సద‌స్సులో మాట్లాడుతూ ఆయ‌న ఈ మేర‌కు స్పందించారు. మొత్తం అన్ని ప‌నులూ చేసేసేలా మ‌నం ఒక దాన్ని త‌యారుచేస్తున్నామంటే నాకెందుకో కాస్త ఆందోళ‌న‌గా ఉంటుంది. ఎందుకంటే […]

  • Publish Date - May 8, 2023 / 04:38 PM IST

Artificial Intelligence

విధాత‌: అప‌ర కుబేరుడు, పెట్టుబ‌డిదారుడైన వారెన్ బ‌ఫెట్ ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) పై సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏఐను ఆటంబాంబుతో పోల్చారు. ఏఐ అభివృద్ధి చెందుతున్న విధానం చూస్తుంటే త‌న‌కు ఆటం బాంబు త‌యారీలో ద‌శ‌లు గుర్తుకు వ‌స్తున్నాయ‌ని వ్యాఖ్యానించారు.

తాజాగా బెర్క్‌షైర్ హాథ్‌వే వార్షిక సద‌స్సులో మాట్లాడుతూ ఆయ‌న ఈ మేర‌కు స్పందించారు. మొత్తం అన్ని ప‌నులూ చేసేసేలా మ‌నం ఒక దాన్ని త‌యారుచేస్తున్నామంటే నాకెందుకో కాస్త ఆందోళ‌న‌గా ఉంటుంది. ఎందుకంటే అలా అనుకునే మ‌నం గ‌తంలో ఒక దాన్ని త‌యారుచేశాం. అందే అణు బాంబు అని వ్యాఖ్యానించారు.

ఏఐ సామ‌ర్థ్యం త‌న‌ను ఆశ్చ‌ర్యానికి గురి చేస్తున్నా.. ఆ టెక్నాల‌జీ ప‌ట్ల త‌న‌కు భ‌యాలున్నాయ‌న్నారు. అయితే మ‌నం ప్ర‌పంచంలో దేన్నైనా సృష్టించ‌గ‌లం కానీ మ‌నిషి ఎలా ఆలోచిస్తాడు, ఎలా ప్ర‌వ‌ర్తిస్తాడ‌న్న విష‌యాల‌ను దేని సాయంతోనూ ఊహించ‌లేమ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

మ‌రోవైపు ఏఐ దుష్ప‌రిణామాల‌పై స్వేచ్ఛ‌గా చ‌ర్చించ‌డానికే గూగుల్‌కు రాజీనామా చేశాన‌ని ఫాద‌ర్ ఆఫ్ ఏఐగా ప్ర‌సిద్ధి చెందిన జాఫ్రీ హింట‌న్ ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే.

Latest News